
సాక్షి, న్యూఢిల్లీ: కరీనా కపూర్, సోనం కపూర్, స్వర భాస్కర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న తాజా బాలీవుడ్ చిత్రం ‘వీరే ది వెడ్డింగ్’.. శశాంక్ ఘోష్ దర్శకత్వంలో మహిళా ప్రాధాన్య చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా చిక్కుల్లో పడింది. ఈ సినిమాలో ఉపయోగించుకున్న ‘హట్ జా తూ’ పాట వాస్తవానికి తాను రాసి పాడినదని, తన అనుమతి లేకుండా ఈ పాటను వాడుకున్నారని, కాపీరైట్స్ హక్కులను ఇది ఉల్లంఘించడమేనని హరియాణాకు చెందిన సింగర్ వికాస్ కుమార్ చిత్రయూనిట్‌కు లీగల్ నోలీసులు పంపారు.
అనుమతి లేకుండా తన పాటను వాడుకున్నందుకు చిత్రయూనిట్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా తన పాటను వాడుకున్నందుకు రూ. 7 కోట్లు నష్టపరిహారం చెల్లించాలని, తన అనుమతితోనే పాటను సినిమాలో వాడుకోవాలని స్పష్టం చేశారు. సింగర్ వికాస్‌కుమార్ డిమాండ్ల మేరకు చిత్రయూనిట్ నడుచుకోకుంటే వారిపై సివిల్, క్రిమినల్ చర్యలు తీసుకుంటామని, కేంద్ర సెన్సార్ బోర్డు చైర్మన్‌కు కూడా ఫిర్యాదు చేస్తామని ఆయన లాయర్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment