
చండీఘడ్: హర్యానాలో వర్ధమాన గాయని దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని ఇద్దరు యువకులు గాయని హర్షిత దహియాను (22) అతి సమీపంనుంచి కాల్పులు జరిపి హత‍్య చేశారు. పానిపట్ జిల్లాలోని ఛమ్రా గ్రామంలో మంగళవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. వ‍్యక్తిగత కక్షలే ఈ హత్యకు కారణమని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.
పోలీసులు అందించిన సమాచారం ప్రకారం, చమ్రా గ్రామంలో ఒక కార్యక్రమంలో పాల్గొని సా. 4గంటలకు కారులో తిరిగి వస్తున్నపుడు దుండగులు గాయని హర్షితపై కాల్పులు జరిపి పారిపోయారు. దీంతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచారని పానిపట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు, రాహుల్ శర్మ వెల్లడించారు. కారును అడ్డగించిన దుండగులు, కారు డ్రైవర్ సహా ఇతరులను బయటికి రమ్మని చెప్పి, హర్షితపై అతి సమీపంనుంచి కాల్పులు జరిపారని, మృతదేహాన్ని పోస్ట్‌మార్టంకోసం తరలించినట్టు చెప్పారు.
ఢిల్లీలోని నరేలా నివాసిగా ఉన్నారని ప్రాథమిక దర్యాప్తులో తేలిందని పోలీసు అధికారులు తెలిపారు. కొన్ని నెలలు క్రితం ఆమె తల్లిని అత్యాచారం చేసి, హత్య చేసిన కేసులో హర్షిత ప్రధాన సాక్షిగా ఉన్నారన్నారు. ఈ కేసులో ఆమె బావ ఇప్పటికే జైలులో ఉన్నట్టు చెప్పారు. మరిన్ని వివరాలను పరిశీలిస్తున్నామని, దర్యాప్తు కొనసాగుతోందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment