బీజేపీ నేత దారుణ హత్యకు గురయ్యారు. ఐదుగురు గుర్తు తెలియని వ్యక్తులు బీజేపీ నాయకుడు సుఖ్‌బీర్ ఖతానాను కాల్చి చంపారు. కాగా, ఆయన మర్డర్‌పై రంగంలోకి దిగిన హర్యానా పోలీసులు సీసీ టీవీ ఫుటేజీల ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నట్టు తెలిపారు.
వివరాల ప్రకారం.. గుర్గావ్‌లోని ఓ క్లాత్ షోరూమ్‌లో స్థానిక బీజేపీ నాయకుడు సుఖ్‌బీర్ ఖతానాను ఐదుగురు వ్యక్తులు కాల్చి చంపారు. షోరూమ్‌లోని ప్రవేశించిన దుండగులు సుఖ్‌బీర్‌పై విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. అనంతరం, అక్కడి నుంచి పారిపోయారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సుఖ్‌బీర్ ఖతానా ఆసుపత్రికి తరలించేలోపే ఆయన మరణించినట్టు పోలీసు ఉన్నతాధికారి దీపక్ సహారన్ తెలిపారు.
కాగా, సుఖ్‌బీర్ ఖతానా జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఎన్నికల్లో రిథోజ్ నుండి పోటీ చేసేందుకు సిద్ధపడుతున్నట్టు స్థానిక మీడియాతో ఇటీవలే కథనాలు వెలువడ్డాయి. సుఖ్‌బీర్ గుర్గావ్‌లోని సోహ్నా మార్కెట్ కమిటీకి మాజీ వైస్ చైర్‌పర్సన్‌గా కొనసాగారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్‌కు సుఖ్‌బీర్ ఖతానా అత్యంత సన్నిహితుడు.
BJP worker and former vice chairman of Sohna Market Committee, Sukhbir Khatana gunned down by unknown assailants in broad daylight on Gurudwara Road #Gurugram. pic.twitter.com/tLxm4YqgxM
— Nikhil Choudhary (@NikhilCh_) September 1, 2022
Comments
Please login to add a commentAdd a comment