
చండీగఢ్ : కాంగ్రెస్ నేత వికాస్ ఛౌదరిపై గుర్తుతెలియని వ్యక్తులు కాల్పులు జరిపారు. ఫరీదాబాద్‌లో గురువారం ఉదయం వికాస్ చౌధరి జిమ్ నుంచి తిరిగివస్తుండగా ఆయన వాహనాన్ని అడ్డగించిన ఇద్దరు దుండగులు విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. సెక్టార్ 9లో నిసించే వికాస్ ఛౌదరి జిమ్ నుంచి తిరిగివస్తూ కారులో ఎక్కిన కొద్దిసేపటికే వెనుక నుంచి మరో వాహనంలో వచ్చిన ఇద్దరు ఆగంతకులు ఆయనపై కాల్పులకు తెగబడ్డారు.
తీవ్రగాయాలతో కొట్టుమిట్టాడిన ఛౌదరిని ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. కాగా హత్య దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో నిక్షిప్తం కావడంతో పోలీసులు వాటిని పరిశీలిస్తున్నారు. కాంగ్రెస్ నేత హత్యతో హర్యానాలో శాంతిభద్రతల పరిస్థితి దయనీయంగా ఉందని వెల్లడైందని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత హత్యపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment