పవన్‌కు హరీశ్‌రావు లీగల్ నోటీసు | legal notice to pavan kalyan | Sakshi
Sakshi News home page

పవన్‌కు హరీశ్‌రావు లీగల్ నోటీసు

Published Wed, Apr 30 2014 1:21 AM | Last Updated on Sat, Jul 6 2019 3:48 PM

పవన్‌కు హరీశ్‌రావు లీగల్ నోటీసు - Sakshi

పవన్‌కు హరీశ్‌రావు లీగల్ నోటీసు

హైదరాబాద్: సీమాంధ్రకు చెందిన కాంగ్రెస్ పార్టీ నేత బొత్స సత్యనారాయణతో కలిసి హరీశ్‌రావు కేబుల్ వ్యాపారాలు చేస్తున్నారన్న సినీనటుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై... ఆయనకు టీఆర్‌ఎస్ నేత హరీశ్‌రావు లీగల్ నోటీసు ఇచ్చారు. పవన్ చేసిన ఆరోపణలు పూర్తిగా నిరాధారమైనవని, దీనిపై పవన్ కల్యాణ్ క్షమాపణ చెప్పాలని అందులో పేర్కొన్నారు. ఈ నెల 26న పవన్ వరంగల్ సభలో మాట్లాడుతూ...

‘‘తెలంగాణకు వ్యతిరేకిగా చెప్పే బొత్స సత్యనారాయణతో హరీశ్‌రావుకు ఏం పని. ఆయనతో కలిసి కేబుల్ వ్యాపారాలు ఎందుకు చేస్తున్నారు? మీరు తెలంగాణకు ఏం న్యాయం చేస్తారు?’’ అంటూ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఈ వ్యాఖ్యలు తన పరువు కు భంగం కలిగించే విధంగా ఉన్నాయని, దీనిపై పవన్ రెండు రోజుల్లో క్షమాపణ చెప్పకపోతే.. సివిల్, క్రిమినల్ చర్యలు చేపడతానని హరీశ్ హెచ్చరించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement