పవన్ కల్యాణ్ పై పరువునష్టం దావా వేస్తా | harish rao condemns pawan kalyan comments | Sakshi
Sakshi News home page

పవన్ కల్యాణ్ పై పరువునష్టం దావా వేస్తా

Published Sun, Apr 27 2014 8:44 AM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

పవన్ కల్యాణ్ పై పరువునష్టం దావా వేస్తా - Sakshi

పవన్ కల్యాణ్ పై పరువునష్టం దావా వేస్తా

హైదరాబాద్: నటుడు, జనసేన పార్టీ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ పై టీఆర్ఎస్ నేత హరీష్ రావు మండిపడ్డారు. టీఆర్ఎస్ పై విమర్శలు గుప్పిస్తున్న పవన్ నిరాధరమైన వ్యాఖ్యలు చేస్తే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హరీష్ హెచ్చరించారు. మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణతో తనకు వ్యాపార సంబంధాలున్నాయని పవన్ చేసిన ఆరోపణలను ఆయన ఖండించారు. తనపై చేసిన వ్యాఖ్యలకు గాను ఇరవై నాలుగు గంటల్లో ఆధారాలు చూపకపోతే పరువు నష్టం దావా వేస్తానని హరీష్ స్పష్టం చేశారు. పవన్ ఇదే తరహా వ్యాఖ్యలు చేస్తే భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారన్నారు.

 

తెలంగాణలో సుడిగాలి పర్యటన నిర్వహిస్తున్న పవన్ కల్యాణ్.. టీఆర్ఎస్ పార్టేనే లక్ష్యంగా విమర్శలకు దిగుతున్నారు. టీఆర్ఎస్ ఎంపీ సీట్లను అమ్ముకుందంటూ నిన్న తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఒక్కో ఎంపీ సీటును రూ. 30 కోట్లకు అమ్మకానికి పెట్టి టికెట్లు కేటాయించారంటూ పవన్ ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement