
ముంబై : గత ఐదు రోజుల క్రితం జరిగిన చెత్త గొడవ విరాట్, అనుష్కలను చిక్కుల్లో పడేసింది. ఇటీవల అనుష్క, విరాట్ కలిసి కారులో వెళుతుండగా పక్కనే లగ్జరీ కారులో వెళ్తున్న అర్హాన్ సింగ్ ప్లాస్టిక్ కవరును రోడ్డుపై పడేయడం... అది గమనించిన అనుష్క కారు ఆపి మరీ అతని ప్రవర్తనపై ఆగ్రహం వ్యక్తం చేయడం... దాన్ని వీడియో తీసిన విరాట్ ట్విటర్‌లో పోస్టు చేయడం.. ఇదంతా ట్విటర్‌లో పెద్ద ఇష్యూనే అయింది. తాజాగా విరాట్, అనుష్కలకు వ్యతిరేకంగా అర్హన్ లీగల్ నోటీసులు పంపాడు. అర్హన్ పంపిన ఈ నోటీసులకు ఇంకా అనుష్క, విరాట్‌లు స్పందించలేదు. మరోవైపు అర్హాన్ సింగ్ ఫేస్‌బుక్ ద్వారా తాను చేసిన పనికి క్షమాపణలు చెప్పారు. కానీ అనుష్క, విరాట్ తన పట్ల ప్రవర్తించిన తీరును మాత్రం విమర్శించారు. ఈ మేరకే నోటీసులను పంపినట్టు తెలిసింది. ‘నేను రోడ్డుపై పడేసిన చెత్త కంటే అనుష్క నోట్లో నుంచి వచ్చిన చెత్తే ఎక్కువగా ఉంది. సెలబ్రిటీ అయివుండి రోడ్డున పోయే వ్యక్తిలాగా కేకలు వేసింది. ఇది మీకు మర్యాద అనిపించుకోదు’ అని పేర్కొన్నారు.
నెటిజన్లు కూడా కొందరు విరుష్కలను తిట్టిపోశారు. ‘మ్యాచ్‌ల్లో నోటికొచ్చినట్లు మాట్లాడుతుంటారు. మీరు బూతులు మాట్లాడినప్పుడలా కెమెరాను స్లోమోషన్‌లో పెట్టొద్దు అని చెప్తారా? మిమ్మల్ని చూసి చాలా మంది అలా తిట్టడం ఫ్యాషన్ అనుకుంటున్నారు. అప్పుడు మీ విలువలు ఏమైపోయాయి?’ అని ఒకరు అడగ్గా, ‘అనుష్కకు రోడ్డుపై చెత్త పారేస్తున్నారన్న చింత కంటే.. దానిని వెంటనే వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలన్న ఆతృతే ఎక్కువగా ఉన్నట్టుంది. లేకపోతే అనుష్క అంతగా అరుస్తున్నప్పుడు విరాట్‌కు వీడియో తీయాలన్న ఆలోచన ఎలా వస్తుంది?’ అని మరో నెటిజన్ ప్రశ్నించాడు. ఇలా విరుష్కలపై పెద్ద ఎత్తున్న కామెంట్లు వచ్చాయి.
Comments
Please login to add a commentAdd a comment