
సాక్షి, హైదరాబాద్: మాజీ సీఎం కేసీఆర్‌కు, బీఆర్ఎస్ పార్టీకి మంత్రి సీతక్క లీగల్ నోటీసులు ఇచ్చారు. బీఆర్ఎస్ సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేశారని సీతక్క నోటిసులు జారీ చేశారు. ‘ఇందిరమ్మ రాజ్యం.. ఇసుకాసురుల రాజ్యం’ వీడియో ప్రతిష్టకు భంగం కలిగేలా ఉందని సీతక్క ఆరోపణ.
వంద కోట్లకు పరునష్టం దావా వేసిన మంత్రి సీతక్క.. బేషరతుగా లిఖిత పూర్వక క్షమాపణ చెప్పాలంటూ డిమాండ్ చేశారు. జూన్ 24వ తేదీన బీఆర్ఎస్ అధికారిక సోషల్ మీడియా పేజీలో పోస్టులు పెట్టారు. నిరాధార ఆరోపణలు చేశారని, ఇది పద్దతి కాదని ఆమె పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment