సాక్షి, న్యూఢిల్లీ: ట్విట్టర్ వేదికగా తనపై చేసిన అనుచిత వ్యాఖ్యలు ఉపసంహరించుకుని బేషరతుగా క్షమాపణలు చెప్పాలంటూ మంత్రి కేటీఆర్‌కు మండోలి జైలులో మనీలాండరింగ్ నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ లీగల్ నోటీసు పంపారు. రోగ్, నోటెడ్ క్రిమినల్, ఫ్రాడ్ అంటూ చేసిన వ్యాఖ్యలు తనను కించపరిచేలా ఉన్నాయంటూ అనంతరం లీగల్ అడ్వొకేట్, సొలిసిటర్స్ ద్వారా నోటీసుఇచ్చారు.
రాజకీయ, సినిమా వ్యాపార రంగాల్లో తనకు మంచి పేరుందని, అయితే కేటీఆర్ వ్యాఖ్యలతో తన సర్కిల్‌లో కీర్తిప్రతిష్టలు దెబ్బతిన్నాయని సుకేశ్ ఆరోపించారు. వారంలోగా తనపై చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని క్షమాపణలు చెప్పకుంటే చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని ఆ నోటీసులో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment