అమితాబ్‌కు బార్‌ కౌన్సిల్‌ లీగల్‌ నోటీసులు  | Amitabh Bachchan Gets Legal Notice From Bar Council of Delhi | Sakshi
Sakshi News home page

Published Thu, Nov 1 2018 6:31 PM | Last Updated on Thu, Nov 1 2018 6:37 PM

Amitabh Bachchan Gets Legal Notice From Bar Council of Delhi - Sakshi

న్యూఢిల్లీ: బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అమితాబ్‌ బచ్చన్‌ నటిస్తున్న ప్రచార చిత్రాలు వివాదాస్పదంగా మారుతున్నాయి. తాజాగా ఆయన నటించిన ఎవరెస్ట్‌ మసాలా యాడ్‌పై ఢిల్లీ బార్ కౌన్సిల్‌ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ యాడ్‌లో ఎటువంటి అనుమతి లేకుండా లాయర్‌ కోట్‌ను వినియోగించడాన్ని తప్పుపడుతూ బార్‌ కౌన్సిల్‌ అమితాబ్‌కు లీగల్‌ నోటీసులు పంపింది. ఆయనతో పాటు ఎవరెస్ట్‌ మసాలా, యూట్యూబ్‌, ఓ మీడియా సంస్థకు కూడా బార్‌ కౌన్సిల్‌ నోటీసులు పంపింది.

ఈ యాడ్‌ను ఎటువంటి అనుమతి లేకుండా ప్రసారం చేసినందుకు చట్టరీత్యా తీసుకునే చర్యలకు వారు బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆ నోటీసుల్లో పేర్కొంది. అలాగే ఈ యాడ్‌ను తక్షణమే నిలిపివేయాలని కోరింది. నోటీసులు అందుకున్నవారు పది రోజుల్లో స్పందించాల్సిందిగా నోటీసుల్లో పొందుపరిచింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement