Amitabh Bachchan Sells His Delhi House Soopan To Nezone Group CEO, Details Inside - Sakshi
Sakshi News home page

Amitabh Bachchan: బిగ్‌ బీ ఇల్లు కొనుగోలు చేసిన సీఈవో, ధర ఎంతంటే..

Published Thu, Feb 3 2022 4:09 PM | Last Updated on Thu, Feb 3 2022 6:14 PM

Amitabh Bachchan Sells Delhi House Sopaan For 23 Crore - Sakshi

Amitabh Bachchan Sells Delhi House Sopaan For 23 Crore: బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ తన ఇంటిని అమ్మేశారు. సౌత్‌ ఢిల్లీలోని ఆ ఖరీధైన బంగ్లాకు 'సోపాన్‌' అని పేరు. అందులో అమితాబ్‌ తల్లిదండ్రులు హరివంశ్ రాయ్ బచ్చన్, తేజి బచ్చన్ ఉండేవారు. హీరో కావాలని అమితాబ్‌ ముంబైకి వచ్చేవరకు ఆ ఇంట్లోనే ఉండేవారు. అంతేకాకుండా బచ్చన్‌ ఫ్యామిలీకి మొట్టమొదటి సొంతిల్లు కూడా అదే. అయితే తాజాగా ఆ ఇంటిని అమితాబ్‌ అమ్మేశారు.

సోపాన్‌ను నెజోన్‌ గ్రూప్‌ ఆఫ్‌ కంపెనీ సీఈవో అవని బడెర్‌ సుమారు రూ.23 కోట్లకు కొనుగోలు చేశారు. ఇక బచ్చన్‌ ఫ్యామిలీకి అవని బడెర్‌ ఎప్పటి నుంచో తెలుసు. 'సోపాన్‌'కు దగ్గర్లోనే ఆయన కూడా నివసించేవారు. ఇప్పుడు ఆ ఇంటిని ఆయన సొంతం చేసుకున్నారు.

అయితే సోపాన్‌ను అమ్మినా అమితాబ్‌కు ముంబైలోని జుహులోనే ఐదు విశాలవంతమైన బంగ్లాలు ఉన్నాయి. జనక్, జల్సా, ప్రతీక్ష, వత్స, అమ్మ అని పేర్లున్న ఈ బంగ్లాలు ఎంతో ఖరీదైనవి. ఇక గతేడాది అంధేరిలో సుమారు రూ. 31 కోట్లు పెట్టి బిగ్‌బి ఓ డూప్లెక్స్‌ ఫ్లాట్‌ని కూడా కొనుగోలు చేసిన సంగతి తెలిసిందే. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement