
తమిళ సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్‌కు కోపం వచ్చింది. తన ఫొటోలను అనుమతి లేకుండా వినియోగించ వద్దంటూ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. సూపర్ స్టార్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ మేరకు తలైవా తరపు న్యాయవాది పబ్లిక్ నోటీస్ విడుదల చేశారు. దీంతో కోలీవుడ్‌లో ఈ విషయంపై చర్చ మొదలైంది.
ఆ నోటీస్‌లో ఏముందంటే..'రజినీకాంత్ సెలబ్రిటీ హోదాలో ఉన్నారు. బిజినెస్‌పరంగా ఆయన పేరు, ఫొటోలు ఉపయోగించుకునే హక్కు ఆయనకు మాత్రమే ఉంంది. కొందరు ఆయన మాటలను, ఫొటోలను, వ్యంగ్య చిత్రాలను దుర్వినియోగం చేస్తున్నారు. ఇలా ఆయన అనుమతి లేకుండా ప్రజాదరణ పొందుతూ వారి ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తుకుంటున్నారు. సినీ ఇండస్ట్రీలో ఆయన ఓ సూపర్‌స్టార్. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇండస్ట్రీలో ఆయనకు ఎంతో గౌరవం ఉంది. రజినీకాంత్ ప్రతిష్ఠకు ఏదైనా భంగం కలిగిస్తే దాని వల్ల ఎంతో నష్టం కలుగుతుంది. ఇకపై రజినీకాంత్ అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు వాడకూడదు.' అని నోటీసుల్లో పేర్కొన్నారు.
కాగా.. తలైవా ప్రస్తుతం నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో జైలర్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ హీరో శివరాజ్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment