Superstar Rajinikanth
-
సినిమాలకు గుడ్ బై? ఫ్యాన్స్‌కి షాక్ ఇచ్చిన సూపర్ స్టార్
-
తలైవా సీరియస్ వార్నింగ్.. ఇంకోసారి రిపీట్ అయిందో..!
తమిళ సూపర్ స్టార్, తలైవా రజినీకాంత్‌కు కోపం వచ్చింది. తన ఫొటోలను అనుమతి లేకుండా వినియోగించ వద్దంటూ తీవ్రమైన హెచ్చరికలు జారీ చేశారు. సూపర్ స్టార్ ఈ వ్యాఖ్యలు చేయడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. ఈ మేరకు తలైవా తరపు న్యాయవాది పబ్లిక్ నోటీస్ విడుదల చేశారు. దీంతో కోలీవుడ్‌లో ఈ విషయంపై చర్చ మొదలైంది. ఆ నోటీస్‌లో ఏముందంటే..'రజినీకాంత్ సెలబ్రిటీ హోదాలో ఉన్నారు. బిజినెస్‌పరంగా ఆయన పేరు, ఫొటోలు ఉపయోగించుకునే హక్కు ఆయనకు మాత్రమే ఉంంది. కొందరు ఆయన మాటలను, ఫొటోలను, వ్యంగ్య చిత్రాలను దుర్వినియోగం చేస్తున్నారు. ఇలా ఆయన అనుమతి లేకుండా ప్రజాదరణ పొందుతూ వారి ఉత్పత్తులను మార్కెటింగ్ చేస్తుకుంటున్నారు. సినీ ఇండస్ట్రీలో ఆయన ఓ సూపర్‌స్టార్. ప్రపంచవ్యాప్తంగా ఎంతోమంది అభిమానులు ఉన్నారు. ఇండస్ట్రీలో ఆయనకు ఎంతో గౌరవం ఉంది. రజినీకాంత్ ప్రతిష్ఠకు ఏదైనా భంగం కలిగిస్తే దాని వల్ల ఎంతో నష్టం కలుగుతుంది. ఇకపై రజినీకాంత్ అనుమతి లేకుండా ఫోటోలు, వీడియోలు వాడకూడదు.' అని నోటీసుల్లో పేర్కొన్నారు. కాగా.. తలైవా ప్రస్తుతం నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో జైలర్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్, కన్నడ హీరో శివరాజ్‌కుమార్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. -
థియేటర్ దద్దరిల్లేలా.. అన్నాత్తెలో రజనీ మోషన్ పోస్టర్
అన్నయ్య బైక్ ఎక్కారు. ఒక చేతిలో బైక్ హ్యాండిల్ బార్, ఇంకో చేతిలో కత్తి... విలన్లను చెడుగుడు ఆడటానికే వెళుతున్నారని అర్థం అవుతోంది. ‘అన్నాత్తే’లోని రజనీకాంత్ తాజా స్టిల్ ఇది. అన్నాత్తే అంటే పెద్దన్నయ్య అని అర్థం. శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం మోషన్ పోస్టర్, లుక్స్ విడుదలయ్యాయి. ‘థియేటర్ దద్దరిల్లేలా..’ అంటూ ఈ రెండింటినీ రిలీజ్ చేశారు. రజనీ స్టయిలిష్ లుక్స్‌ని చూసి ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. నయనతార, కీర్తీ సురేష్, ఖుష్బూ, మీనా తదితరులు నటించిన ఈ చిత్రం దీపావళి సందర్భంగా నవంబర్ 4న విడుదల కానుంది. #AnnaattheFirstLook @rajinikanth @directorsiva #Nayanthara @KeerthyOfficial @immancomposer @khushsundar #Meena @sooriofficial @AntonyLRuben @dhilipaction @vetrivisuals#AnnaattheDeepavali pic.twitter.com/pkXGE022di — Sun Pictures (@sunpictures) September 10, 2021 -
కర్ణాటకలో ‘ కాలా’ కష్టాలు
బెంగళూరు: కర్ణాటకలో సూపర్ స్టార్ రజనీకాంత్ అభిమానులకు చేదు వార్త. అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న తలైవా తాజా చిత్రం ‘ కాలా’ కర్ణాటకలో విడుదలయ్యే అవకాశం కనిపించడంలేదు. కావేరీ జల వివాదంపై రజనీకాంత్ చేసిన వాఖ్యలపట్ల కర్ణాటక వాసులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. దీంతో కర్ణాటక ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ ‘ కాలా’ చిత్రాన్ని ప్రదర్శించరాదని నిర్ణయించుకుంది. కావేరీ జలాలపై రజనీ వాఖ్యలు కన్నడిగుల మనోభావాలను దెబ్బతీశాయని దీంతో చిత్ర ప్రదర్శనను అడ్డుకుంటున్నామని ఫిల్మ్‌ఛాంబర్ తెలిపింది. తమిళనాడుకు కావేరీ జలాలను తక్షణమే విడుదల చేయాలని రజనీకాంత్ గతంలో కోరిన విషయం తెలిసిందే. కర్ణాటకకు చెందిన రజనీకాంత్ తమిళనాడులో నటుడై ఇక్కడే పేరు, ప్రఖ్యాతులు పొందారు. అయితే ప్రస్తుతం కావేరి మేనేజ్మెంట్ సమస్య తమిళనాడు, కార్ణాటక మధ్య ఆగ్రహ జ్వాలలను రేకెత్తిస్తున్న విషయం తెలిసిందే. రజనీకాంత్ తమిళనాడుకు కావేరి వ్యవహారంలో మద్ధతుగా మాట్లాడాల్సిన నిర్భంధానికి గురయ్యారు. ఆయన అదే చేశారు కూడా. కావేరి మేనేజ్మెంట్ బోర్టు ఏర్పాటు చేయాలంటూ కోలీవుడ్ నిర్వహించిన దీక్షలోనూ రజనీకాంత్ పాల్గొన్నారు. దీంతో కన్నడిగులు ఆయనపై గుర్రుగా ఉన్నారు. కొన్ని కర్ణాటక సంఘాలు అయితే తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. నటుడు ధనుష్ తన వండర్‌బార్ ఫిలింస్ పతాకంపై నిర్మించిన చిత్రం కాలా. ఈశ్వరిరావు, బాలీవుడ్ బ్యూటీ హ్యూమా ఖురేషీ, నానాపటేకర్, సముద్రకని వంటి ప్రముఖులు ప్రధాన పాత్రలను పోషించిన ఈ చిత్రానికి కబాలీ చిత్రం ఫేమ్ పా.రంజిత్ దర్శకుడు. ముంబాయిలోని ధారవి నేపథ్యంలో జరిగే ఒక దాదా కథగా తెరకెక్కిన చిత్రం అని, ఇందులో రాజకీయ పరమైన అంశాలు చాలానే చోటు చేసుకుంటాయని ప్రచారం జరుగుతోంది. ఈ చిత్రాన్ని జూన్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంపై రజనీకాంత్ గత చిత్రాలన్నింటికంటే అధికంగా అంచనాలు, ఆసక్తి పెంచుకున్నారు. కారణం చిత్రంలో రాజకీయ సెటైరికల్ సంభాషణలు ఒక అంశం కాగా.. ఇది రజనీకాంత్ రాజకీయ రంగ ప్రవేశం గురించి ప్రకటించిన తరువాత విడుదల కానున్న చిత్రం కావడం మరో అంశం. ఇక నటుడు సత్యరాజ్ ఏవో అనుచిత వ్యాఖ్యలు చేశారని ఆయన ఒక పాత్రలో నటించిన బాహుబలి చిత్ర విడుదలనే కన్నడిగులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. చివరికి సత్యరాజ్ క్షమాపణ చెప్పక తప్పలేదు. అలాంటిది కర్ణాటకలో పుట్టిన రజనీకాంత్ విషయంతో కన్నడిగులు ఉదారత చూపించలేదు. మరి ఈ సూపర్‌స్టార్ కూడా సారీ చెబుతారా? కాలా ఎలాంటి సమస్య లేకుండా కర్ణాటకలో విడుదలవుతుందా? అన్న ఆసక్తి చిత్ర వర్గాల్లో నెలకొంది. -
‘ఇంకా ఆ ఘడియ రాలేదు’
సాక్షి ప్రతినిధి, చెన్నై: ‘ఈ వేడుకకు వచ్చిన వారంతా ఏ విషయంపై ఎదురుచూస్తున్నారో ఊహించగలను, నేనేం చేసేది.. ఇంకా ఆ సమయం రాలేదు’ అని నటుడు రజనీకాంత్ వ్యాఖ్యానించారు. చెన్నైలో బుధవారం రాత్రి నిర్వహించిన ‘కాలా’ చిత్రం ఆడియో ఆవిష్కరణ వేడుకలో ఆయన అనేక విషయాలను నర్మగర్భంగా ప్రస్తావించారు. రాజకీయ పార్టీ ప్రకటనపై మాత్రం ఇంకా జాప్యం జరగనున్నట్లు స్పష్టమైన సందేశం ఇచ్చారు. ‘‘గత నాలుగు దశాబ్దాలుగా నా పనైపోయిందని కొందరు హేళన చేస్తూనే ఉన్నారు. తమిళనాడు ప్రజలు, ఆ దేవుడు నేను ముందుకు సాగేలా చేస్తూనే ఉన్నారు. ఎవరెన్ని విమర్శలు, ఆక్షేపణలు చేసినా నా మార్గంలో నేను పయనిస్తూనే ఉంటా. దక్షిణాదిన నదుల అనుసంధానం నా కల. ఒకవేళ ఈ కల నెరవేరకపోయినా ఫరవాలేదు. మన ఆలోచనలే బలం, మంచి ఆలోచనలతో చెడు ఆలోచనలు తుడిచివేయండి, అపుడే జీవితం బాగుంటుంది. సినిమాల పరంగా అనేక విషయాలు మాట్లాడాను, అయితే అందరూ మరో విషయం కోసం ఎంతో ఆత్రుతతో ఎదురుచూస్తున్నారు. నేనేం చేసేది ఇంకా ఆ తేదీ రావాలి. సమయం వస్తుంది. ఆ దేవుని ఆశీర్వాదంతో తమిళనాడుకు, ప్రజలకు మంచి రోజులు వస్తాయి’’అని రజనీ ప్రసంగం ముగించారు. -
సూర్య అవయవదానం
ప్రముఖ నటుడు సూర్య అవయవ దానం చేయనున్నట్లు ప్రకటించారు. సూపర్‌స్టార్ రజనీ కాంత్ నేత్రదానం చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కమల్‌హాసన్ వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం తన శరీరాన్నే దానం చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. నటి స్నేహ తన కళ్లను, మాధవన్ కళ్లు, గుండె, కాలేయం లాంటి అవయవాలను దానం చేయనున్నట్లు ప్రకటించారు. ఇటీవల అవయవదానం అవగాహన కార్యక్రమంలో పాల్గొ న్న సూర్య అనంతరం తాను అవయవదానం చేయనున్నట్లు వెల్లడిస్తూ తన అభిమానులు అవయవదానాలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.