
సూర్య అవయవదానం
ప్రముఖ నటుడు సూర్య అవయవ దానం చేయనున్నట్లు ప్రకటించారు. సూపర్‌స్టార్ రజనీ కాంత్ నేత్రదానం చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు.
ప్రముఖ నటుడు సూర్య అవయవ దానం చేయనున్నట్లు ప్రకటించారు. సూపర్‌స్టార్ రజనీ కాంత్ నేత్రదానం చేయనున్నట్లు ఇప్పటికే ప్రకటించారు. కమల్‌హాసన్ వైద్య విద్యార్థుల పరిశోధనల కోసం తన శరీరాన్నే దానం చేయడానికి సంసిద్ధత వ్యక్తం చేశారు. నటి స్నేహ తన కళ్లను, మాధవన్ కళ్లు, గుండె, కాలేయం లాంటి అవయవాలను దానం చేయనున్నట్లు ప్రకటించారు. ఇటీవల అవయవదానం అవగాహన కార్యక్రమంలో పాల్గొ న్న సూర్య అనంతరం తాను అవయవదానం చేయనున్నట్లు వెల్లడిస్తూ తన అభిమానులు అవయవదానాలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు.