vote for cash case
-
ఓటుకు నోటు కేసు.. కేటీఆర్‌కు బండి సంజయ్ కౌంటర్
సాక్షి, హైదరాబాద్: కేంద్రమంత్రి బండి సంజయ్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌కు పొలిటికల్ కౌంటరిచ్చారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలోనే కదా ఓటుకు నోటు కేసు నమోదు చేసి విచారణ పూర్తి చేయలేకపోయింది. ఇది మీ ప్రభుత్వ వైఫల్యం కాదా? అని ప్రశ్నించారు.కాగా, బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా..‘ఓటుకు నోటు కేసు నమోదు చేసి విచారణ పూర్తి చేయలేకపోయింది గత మీ ప్రభుత్వమే కేటీఆర్. 2015 నుంచి కేసును పూర్తి చేయడంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది. ట్విట్టర్లో స్టార్ డం కోసం కేటీఆర్ కేంద్ర ప్రభుత్వాన్ని లాగుతున్నారు. మీరు నిజంగా న్యాయం జరగాలని కోరుకుంటే ఓటుకు నోటు కేసును సీబీఐకి లేదా ఈడీకి బదిలీ చేసి ఉండాల్సింది. కేటీఆర్ వ్యవహారం రాహుల్ గాంధీ లేని లోటు భర్తీ చేస్తున్నట్లు ఉంది’ అంటూ ఎద్దేవా చేశారు. Welcome Home K T Rama Rao garu..Jet Lag & whatever you had seems to be taking toll on you..ACB registered the Cash for vote case, and your inefficient BRS govt couldn't defend it for years.Since 2015, your incompetent govt has failed to finish the trial. Now, for optics…— Bandi Sanjay Kumar (@bandisanjay_bjp) September 15, 2024ఇదిలా ఉండగా.. అంతకుముందు బండి సంజయ్‌పై కేటీఆర్ కీలక కామెంట్స్ చేశారు. ‘బీజేపీ అధికారంలోకి వచ్చి ఉంటే కేసీఆర్‌ను జైల్లో వేసేవాళ్లం. అంకుశం సినిమాలో రాంరెడ్డి లాగా గుంజుకుపోయేటోళ్లం’ అంటూ బండి సంజయ్ కుమార్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ స్పందించారు. ఈ సందర్భంగా కేటీఆర్..‘బీఆర్ఎస్ నాయకులను, ముఖ్యంగా కేసీఆర్ గారిని జైల్లో పెట్టడం పట్ల మీకున్న అత్యుత్సాహాన్ని నేను అర్థం చేసుకోగలను. కానీ ఓటుకు నోటు స్కామ్‌లో కెమెరాకు చిక్కిన వ్యక్తి ఇప్పటికీ స్వేచ్ఛగా ఎలా తిరుగుతున్నాడో చెప్పండి! మీరు ప్రశ్నించలేదు. బహుశా బడే భాయ్ (ప్రధాని మోదీ), ఛోటే భాయ్ (సీఎం రేవంత్) మధ్య సంబంధాన్ని మీరు ఇంకొంచెం ఎక్కువగా దర్యాప్తు చేయాలేమో కదా?. కొన్నేళ్లుగా అన్ని సాక్ష్యాలు స్పష్టంగా బయటకు కనిపిస్తున్నప్పటికీ ఛోటే భాయ్ ఎందుకు జైలులో లేడు!. ఇన్నాళ్లూ కేంద్రంలో అధికారంలో ఉన్నది బీజేపీ కాదా?. మిమ్మల్ని ఆపేది ఏది? ఎవరు? అంటూ ప్రశ్నించారు. ఇది కూడా చదవండి: ఎమ్మెల్యే గాంధీ ఇంటి వద్ద భారీగా పోలీసులు -
సీఎం రేవంత్‌పై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం
సాక్షి,న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం(సెప్టెంబర్2) ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా రేవంత్‌రెడ్డి వైఖరిని సుప్రీంకోర్టు మరోసారి తప్పుపట్టింది. లిక్కర్ కేసులో కవితకు బెయిల్ ఇవ్వడంపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను పిటిషనర్ లాయర్స్ మరోసారి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ పీసీసీ ట్విటర్ హ్యాండిల్‌లోనే కవిత బెయిల్‌పై పోస్టులు పెట్టిన విషయాన్నికోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ‘బెయిల్ గ్రాంటెడ్.. బెయిల్ గివెన్..? అని పోస్టులు పెట్టినట్లు తెలిపారు. సీఎం రేవంతే పీసీసీ చీఫ్‌గా ఉన్నారని కోర్టుకు విన్నవించారు. దీనిపై జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కెవి విశ్వనాథన్ ధర్మాసనం స్పందింంది. ఈ పోస్టులను కోర్టు దృష్టికి తేవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు‘ఉన్నత స్థానాలలో ఇలా వ్యవహరించడం మంచిది కాదు. లాయర్లను, జడ్జిలను రాజకీయాల్లోకి లాగడం సరికాదు. న్యాయ వ్యవస్థగా మీ నుంచి గౌరవాన్ని ఆశిస్తున్నాం’అని రేవంత్‌ను ఉద్దేశించి ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో రేవంత్ ఇప్పటికే క్షమాపణలు చెప్పారని ఆయన తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కోర్టుకు తెలిపారు. దీనికి స్పందించిన బెంచ్ రిప్లై ఫైల్ చేయాలని రేవంత్ న్యాయవాదిని ఆదేశించింది. కాగా, ఓటుకు నోటు కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది. -
అందుకే ‘ఓటుకు నోటు’ విచారణ బదిలీ కోరుతున్నాం
న్యూఢిల్లీ, సాక్షి: రాజకీయాలతో ముడిపడిన కేసు, పైగా రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు గనుకే.. ఓటుకు నోటు కేసు విచారణ ప్రభావితం కాకుండా మరో చోటుకి బదిలీ కోరుతున్నామని సుప్రీం కోర్టులో పిటిషనర్ వాదించారు. శుక్రవారం ఉదయం ఓటుకు నోటు కేసు పిటిషన్‌కు సంబంధించిన విచారణ జరిగింది.ఈ పిటిషన్‌కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం, సీఎం రేవంత్‌రెడ్డికి సుప్రీం కోర్టు నోటీసులు పంపించింది. అయితే రెండు వైపుల నుంచి కౌంటర్ మాత్రం దాఖలు కాలేదు. దీంతో కౌంటర్ దాఖలు చేసేలా ఆదేశాలు ఇవ్వాలంటూ పిటిషనర్ తరఫు న్యాయవాది బెంచ్‌ను కోరారు. అయితే.. కౌంటర్ తప్పకుండా వేయాలంటూ తాము ఆదేశించలేమని జస్టిస్ గవాయితో కూడిన త్రిసభ్య ధర్మాసనం, పిటిషనర్‌కు స్పష్టం చేస్తూ విచారణను జులైకి వాయిదా వేసింది.ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న రేవంత్ రెడ్డి సీఎం కావడంతో విచారణ భోపాల్ కు బదిలీ చేయాలని మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను జస్టిస్ బి.ఆర్. గవాయి, జస్టిస్ సతీష్ చంద్ర మిశ్రా, జస్టిస్ సందీప్ మెహతాలతో కూడిన ధర్మాసనం విచారణ జరపుతోంది.ఇక.. విచారణ సమయంలో ఇరువర్గాల న్యాయవాదులు పరస్పరం ఆరోపణలు చేసుకున్నారు. ఒకానొక దశలో పరిస్థితి శ్రుతి మించడంతో ‘‘ఇంతటి క్రమశిక్షణరాహిత్యాన్ని ఎప్పుడూ చూడలేదు’’ అంటూ జస్టిస్ బిఆర్. గవాయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మరోవైపు.. ఈ కేసు విచారణను భోపాల్‌కే ఎందుకు బదిలీ చేయాలని కోరుతున్నారని బెంచ్ పిటిషనర్‌ను ప్రశ్నించింది. ఇది రాజకీయాలతో ముడిపడి ఉన్న కేసు కాబట్టే.. బదిలీ కోరుతున్నామని జగదీష్ రెడ్డి తరఫున న్యాయవాది బెంచ్‌కు తెలియజేశారు.2015లో తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో డబ్బు ఎర చూపి ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు చంద్రబాబు ప్రయత్నించారు. నాటి టీడీపీ నేత రేవంత్‌రెడ్డిని ఇందుకు మధ్యవర్తిగా నియమించారు. టీడీపీ అభ్యర్థికి ఓటేయాలంటూ నామినేటెడ్ ఎమ్మెల్యే ఎల్విస్ స్టీఫెన్సన్కు డబ్బు ఇస్తూ రేవంత్ తెలంగాణ ఏసీబీకి రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. తదనంతర పరిణామాల్లో.. ఆయన అరెస్ట్ కూడా అయ్యారు. ప్రస్తుతం సుప్రీం కోర్టులో విచారణ నడుస్తున్న పిటిషన్లో రేవంత్ రెడ్డి తరఫున సీనియర్ న్యాయవాదులు ముకుల్ రోహత్గి, సిద్ధార్థ లూథ్రాలు వాదనలు వినిపిస్తున్నారు. చంద్రబాబు పేరెక్కడ?చంద్రబాబు ప్రలోభ పర్వాన్ని తెలంగాణ ఏసీబీ బయటపెట్టింది. ఫోన్లో మాట్లాడుతూ.. ‘‘మనోళ్లు బ్రీఫ్డ్ మీ’’ అని చంద్రబాబున్నారు. ఆ గొంతు బాబుదేనని ఫోరెన్సిక్ సైతం నిర్ధారించింది. మరోవైపు ఈ కేసులో చంద్రబాబునాయుడును నిందితుడిగా చేర్చాలంటూ ఆళ్ల గడ్డ రామకృష్ణారెడ్డి(ఆర్కే) వేసిన పిటిషన్ సుప్రీం కోర్టులో విచారణ జరుగుతోంది. తెలంగాణ ఏసీబీ ఈ కేసు ఛార్జిషీట్లో చంద్రబాబు పేరును 22 సార్లు ప్రస్తావించింది. అయినా కూడా ఆయన పేరును నిందితుడిగా చేర్చకపోవడాన్ని ఆర్కే తన పిటిషన్ ద్వారా లేవనెత్తారు. -
ఓటుకు నోటు కేసు : ఎమ్మెల్యే సండ్రకు నిరాశ
సాక్షి, హైదరాబాద్ : ఓటుకు నోటు కేసులో ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్యకు తెలంగాణ హైకోర్టులో నిరాశ ఎదురైంది. ఈ కేసు నుంచి తనను తొలగించాలంటూ ఆయన పెట్టుకున్న డిశ్చార్జ్ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది. మరోవైపు ఏసీబీ కోర్టులో ఈరోజు జరిగిన విచారణకు కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డి, సండ్ర వెంకట వీరయ్య, సెబాస్టియన్, ఉదయ్ సింహాలు గైర్హాజరయ్యారు. డిసెంబర్ 15న జరిగే తదుపరి విచారణకు అందరూ హాజరుకావాలని కోర్టు ఆదేశించింది. ఇకపై హాజరు మినహాయింపు కోసం వేసే పిటిషన్లను అనుమతించబోమని స్పష్టం చేసింది. కాగా, 2015లో టీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడిగా ఉన్న రేవంత్ రెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో వేం నరేందర్ రెడ్డిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ రూ. 50 లక్షలతో రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు ఉన్నాయి. -
ఆధారాలు ఉన్నాయి; అందుకే అరెస్టు చేశాం
సాక్షి, హైదరాబాద్: దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘ఓటుకు కోట్లు’ కేసులో తదుపరి విచారణను కోర్టు ఈనెల 27కు వాయిదా వేసింది. ఈ కేసులో నిందితులుగా ఉన్న సండ్ర వెంకట వీరయ్య, ఉదయసింహా, తమ పేర్లు తొలగించాలంటూ డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఇందుకు కౌంటర్ దాఖలు చేసిన ఏసీబీ.. పిటిషన్లో పలు కీలక అంశాలు పొందుపరిచింది. తనను అనవసరంగా కేసులోకి లాగారన్న సండ్ర వెంకటవీరయ్య వాదనల్లో నిజం లేదని పేర్కొంది. ఈ మేరకు..‘‘2015లో గండిపేటలో జరిగిన టీడీపీ మహానాడులో నిందితులు కుట్రపన్నారు. స్టీఫెన్సన్ను ప్రలోభపెట్టి టీడీపీ అభ్యర్థి వేం నరేందర్ రెడ్డిని గెలిపించడానికి పథకం రచించారు. రేవంత్ రెడ్డి, ఇతర నిందితులతో కలిసి సండ్ర వెంకటవీరయ్య కుట్ర పన్నారు. శంషాబాద్ నోవాటెల్‌లో రేవంత్ రెడ్డి, సెబాస్టియన్.. సండ్ర వెంకట వీరయ్యతో చర్చించారు. వీరిద్దరితో జరిపిన ఫోన్ కాల్స్ సండ్ర వెంకట వీరయ్య ప్రమేయాన్ని బయటపెట్టాయి. అందుకే ఆయనను అరెస్టు చేసి ఛార్జ్ షీట్ దాఖలు చేశాం. అదే విధంగా రేవంత్ రెడ్డి అనుచరుడు ఉదయ్ సింహాకు కూడా ఓటుకు నోటు కేసులో ప్రమేయం ఉంది. ఉదయ్ సింహాను నాగోలు వద్దకు రావాలని రేవంత్ రెడ్డి చెప్పారు. వేం కృష్ణ కీర్తన్ రెడ్డి నుంచి ఉదయ్ సింహా రూ.50లక్షలు తీసుకొచ్చారు. ఓటుకు నోటు కేసు రుజువు చేసేందుకు అన్ని ఆధారాలున్నాయి’’ అని ఏసీబీ, న్యాయస్థానానికి తెలిపింది. సండ్ర వెంకట వీరయ్య, ఉదయ్ సింహా డిశ్చార్జ్ పిటిషన్లు కొట్టివేయాలని ఈ సందర్భంగా కోర్టును కోరింది. ఈ నేపథ్యంలో ఓటుకు కోట్లు కేసు విచారణను న్యాయస్థానం మంగళవారానికి వాయిదా వేసింది. (చదవండి: చంద్రబాబుది ఆరాటం.. జగన్‌గారిది నిరంతర పోరాటం) కాగా ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఎంపీగా ఉన్న రేవంత్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో.. తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించుకునేందుకు.. నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ను ప్రలోభపెడుతూ రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడిన విషయం తెలిసిందే. 2015 మే 30న వెలుగులోకి వచ్చిన ‘ఓటుకు కోట్లు’ కేసు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన సూత్రధారి టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడేనని ఆరోపణలు ఉన్నాయి. అంతేకాకుండా స్టీఫెన్‌సన్‌తో సాగిన సంభాషణల్లోని గొంతు చంద్రబాబుదేనని ధ్రువీకరిస్తూ చండీగఢ్‌కు చెందిన ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ నివేదిక కూడా ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ కేసు విచారణలో ఎఫ్ఎస్ఎల్ రిపోర్టు కీలక మారింది. -
ఒటుకు నోట్లు కేసు: ఈడీ విచారణకు ఉదయ్‌సింహ
-
రేవంత్ నివాసంలో దాడులను తప్పుబట్టిన బాబు
-
బాబు డైరెక్షన్లోనే ‘టీఆర్ఎస్లో టీడీపీ విలీనం’!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీడీపీ అంతరించిపోయిందంటూ సీనియర్ నేత మోత్కుపల్లి నర్సింహులు చేసిన సంచలన వ్యాఖ్యలు పార్టీలో కలకలం రేపుతున్నాయి. టీటీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేయడం మంచిదన్న మోత్కుపల్లి వ్యాఖ్యలపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. చంద్రబాబు డైరెక్షన్లోనే మోత్కుపల్లి ఈ వ్యాఖ్యలు చేశారా? అన్న సందేహం పార్టీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఓటుకు కోట్లు కేసులో అడ్డంగా దొరికిపోయిన తర్వాత చంద్రబాబు టీటీడీపీని పట్టించుకోవడం మానేశారు. హైదరాబాద్ నుంచి మకాం విజయవాడకు మార్చారు. నామినేటెడ్ ఎమ్మెల్యేను కొనుగోలు చేసేందుకు డబ్బులు ముట్టజెప్తూ టీటీడీపీ నేత రేవంత్‌రెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా దొరికిపోయిన సంగతి తెలిసిందే. అంతేకాకుండా ఈ కేసులో నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్ సన్తో ఫోన్లో మాట్లాడుతూ చంద్రబాబు కూడా దొరికిపోయారు. ఫోన్లో చంద్రబాబు పేర్కొన్న ‘మనవాళ్లు బ్రీఫుడ్ మీ’ వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. బలంగా ఉన్న ఈ కేసు నుంచి తప్పించుకునేందుకే మోత్కుపల్లితో చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేయించి ఉంటారని టీటీడీపీ శ్రేణులు అనుమానిస్తున్నాయి. ఈ కేసుకు ముందు కేసీఆర్ అంటే నిప్పులు చెరిగిన చంద్రబాబు.. కేసు తర్వాత కేసీఆర్‌కు అనుకూలంగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నారు. సీఎం కేసీఆర్‌కు సానుకూలంగా వ్యవహరిస్తున్న చంద్రబాబు తీరు నచ్చక ఇటీవలే రేవంత్‌రెడ్డి టీడీపీకి గుడ్‌బై చెప్పారు. అదేమాటలో మరికొందరు టీటీడీపీ నేతలు ఉన్నట్టు తెలుస్తోంది. మోత్కుపల్లి సంచలన వ్యాఖ్యలివే..! ‘ఎన్టీఆర్ ఘాట్ హైదరాబాద్‌లోనే ఉంది. ఎన్ని పనులున్నా చంద్రబాబు హైదరాబాద్‌కు రావాల్సిందే. తెలంగాణలో టీడీపీ అంతరించిపోయిందన్న వాతావరణం నెలకొంది. భుజాన ఎత్తుకొని పార్టీ కాపాడుకుందామన్న సహకరించే వారు లేరు. తెలంగాణలో పార్టీ అంతరించిపోయి.. మనుగడే లేదనడం కన్నా టీడీపీని టీఆర్ఎస్లో విలీనం చేయటం మంచిది. టీఆర్ఎస్ కూడా మన పార్టీనే, కేసీఆర్ మన దగ్గరి నుంచి వెళ్లిన వ్యక్తే. చంద్రబాబు ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇక్కడ పార్టీకి సమయం కేటాయించలేరు. గౌరవంగా ఉండాలంటే తెలంగాణలో తెలుగుదేశం ఓటు బ్యాంకు కోసం, పార్టీ కార్యకర్తల కోసం టీఆర్ఎస్లో విలీనమే మంచిది’ అని మోత్కుపల్లి పేర్కొన్న సంగతి తెలిసిందే. -
హైకోర్టులో ఓటుకు కోట్లు కేసు విచారణ
-
'ఓటుకు కోట్లు' కేసు ఏమైంది?
హైదరాబాద్: 'నిన్నటివరకు చంద్రబాబుపై అంతెత్తు ఎగిరిపడ్డారు. ఇవ్వాళేమో అమరావతి శంకుస్థాపనకు వెళతామంటున్నారు. అసలు పిలుపు రాకముందే ఎందుకో అంత ఉత్సాహం!' అంటూ మంత్రి కేటీఆర్ పై మండిపడ్డారు నల్లగొండ కాంగ్రెస్ ఎంపీ గుత్తా సుఖేందర్ రెడ్డి. చంద్రబాబు నుంచి పిలుపు రాకముందే అమరావతి వెళ్తామంటున్న కేటీఆర్.. ఓటుకు నోట్లు కేసు ఏమైందో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆదివారం హైదరాబాద్ లో విలేకరులతో మాట్లాడిన గుత్తా.. తమ పార్టీ నేతలపై కేటీఆర్ వ్యాఖ్యల్ని తప్పుపట్టారు. సీఎల్పీ నేత జానారెడ్డి, టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ ఉమార్ రెడ్డిలను ఉద్దేశించి కేటీఆర్ అహంకారంతో మాట్లాడుతున్నారని విమర్శించారు. ఓవైపు తండ్రి కేసీఆర్ జానారెడ్డిని పొగుడుతుంటే, కేటీఆర్ మాత్రం నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. కేటీఆర్ తీరు మార్చుకుంటే మంచిదని హితవుపలికారు. మీ ఊళ్లో అడుగుదామా? శనివారం నల్లగొండ జిల్లాలో ఏర్పాటుచేసిన సబలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ.. ‘‘అయితే ఇటీవల నేను చేసిన వ్యాఖ్యలపై జానారెడ్డి స్పందిస్తూ.. ‘నీకేం తెలుసు నా సంగతి.. మీ అయ్యను అడిగితే చెప్తడు’ అని అన్నారు. మా అయ్యనెందుకు? ఫ్లోరైడ్ పీడిత గ్రామాల్లో ఉన్న అయ్యలనడిగితే మీ చరిత్ర, కాంగ్రెస్ నేతల చరిత్ర చెప్తరు..’’ అని అన్నారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని ఉత్తరకుమార్‌రెడ్డి అని ఎద్దేవా చేస్తూ.. 'ఈయన కార్లో కాదా ఎన్నికలప్పుడు రూ.3 కోట్లు దొరికింది.. ఎక్కడివి ఆ కట్టలు మర్చిపోయిండా? అలాంటి ఆయన టీఆర్ఎస్ను అవినీతిలో దేశముదురు అంటాడా? మేం మాట్లాడితే మీరు తట్టుకోలేరు. ఉద్యమంలో సింగిల్‌గా ప్రారంభమైనా, ఇప్పుడు ప్రతి గ్రామంలో 100 మంది కేసీఆర్లున్నరు. మాకు ఐదేళ్లు పాలించాలని ప్రజలు అధికారం ఇస్తే.. మీరు 15 నెలలకే బొబ్బలు పెడ్తరా?’’ అని విరుచుకుపడ్డ సంగతి తెలిసిందే. -
సిట్ ముందుకు సర్వీస్ ప్రొవైడర్లు!