సాక్షి,న్యూఢిల్లీ: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై సుప్రీంకోర్టు మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. సోమవారం(సెప్టెంబర్2) ఓటుకు నోటు కేసు విచారణ సందర్భంగా రేవంత్‌రెడ్డి వైఖరిని సుప్రీంకోర్టు మరోసారి తప్పుపట్టింది. లిక్కర్ కేసులో కవితకు బెయిల్ ఇవ్వడంపై రేవంత్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను పిటిషనర్ లాయర్స్ మరోసారి సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లారు.
తెలంగాణ పీసీసీ ట్విటర్ హ్యాండిల్‌లోనే కవిత బెయిల్‌పై పోస్టులు పెట్టిన విషయాన్నికోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. ‘బెయిల్ గ్రాంటెడ్.. బెయిల్ గివెన్..? అని పోస్టులు పెట్టినట్లు తెలిపారు. సీఎం రేవంతే పీసీసీ చీఫ్‌గా ఉన్నారని కోర్టుకు విన్నవించారు. దీనిపై జస్టిస్ బిఆర్ గవాయి, జస్టిస్ కెవి విశ్వనాథన్ ధర్మాసనం స్పందింంది.
ఈ పోస్టులను కోర్టు దృష్టికి తేవడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సుప్రీంకోర్టు
‘ఉన్నత స్థానాలలో ఇలా వ్యవహరించడం మంచిది కాదు. లాయర్లను, జడ్జిలను రాజకీయాల్లోకి లాగడం సరికాదు. న్యాయ వ్యవస్థగా మీ నుంచి గౌరవాన్ని ఆశిస్తున్నాం’అని రేవంత్‌ను ఉద్దేశించి ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. ఈ విషయంలో రేవంత్ ఇప్పటికే క్షమాపణలు చెప్పారని ఆయన తరపు న్యాయవాది సిద్ధార్థ్ లూథ్రా కోర్టుకు తెలిపారు. దీనికి స్పందించిన బెంచ్ రిప్లై ఫైల్ చేయాలని రేవంత్ న్యాయవాదిని ఆదేశించింది. కాగా, ఓటుకు నోటు కేసును వేరే రాష్ట్రానికి బదిలీ చేయాలని మాజీ మంత్రి జగదీష్‌రెడ్డి వేసిన పిటిషన్‌పై విచారణను రెండు వారాలకు వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment