సాక్షి,సంగారెడ్డి:లగచర్ల ఫార్మాసిటీకి తాము వ్యతిరేకం కాదని, అయితే రైతులకు అన్యాయం జరగకుండా చూడాలని కేంద్రహోంశాఖ సహాయమంత్రి బండి సంజయ్ కోరారు. సంగారెడ్డిలో ఆదివారం(నవంబర్17) బండి సంజయ్ ఈ మేరకు మీడియాతో మాట్లాడారు.
‘రైతులకు అన్యాయం జరగకుండా చూడాలి. రైతుల గురించి ఆలోచించకుండా దౌర్జన్యం చేయడానికి ఇది రాచరిక పాలనా? గతంలో బీఆర్‌ఎస్ కూడా ఇలానే చేసింది. కలెక్టర్‌పై దాడి అనేది దారుణం. రైతులు కలెక్టర్‌పై దాడి చేయలేదు. ఈ దాడి వెనుక కేటీఆర్,బీఆర్‌ఎస్ నేతలు ఉన్నారని కాంగ్రెస్ చెప్పింది. అయినా చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు. ఇది ప్రభుత్వం చేతగానితనానికి నిదర్శనం.
కేటీఆర్ నక్క వినయం ప్రదర్శించి అన్ని ఛానెళ్లకు ఇంటర్వ్యూ ఇచ్చారు. కేసీఆర్ కొడుకు నటసార్వభౌముడు. కేటీఆర్ ఢిల్లీ వెళ్లి కాంగ్రెస్ హైకమాండ్‌ను కలిశారు. గతంలో కాళేశ్వరం,ఫోన్ ట్యాపింగ్ కేసును ఇలానే నీరు గార్చారు. ఫోన్‌ట్యాపింగ్ అనేది సిరిసిల్ల కేంద్రంగా జరిగింది. కేటీఆర్‌కు తెలియకుండా ఇది జరుగుతుందా. అప్పుడు,ఇప్పుడు సీఎం కేటీఆరే.
దీపావళి బాంబులు ఎక్కడికి పోయాయి. ఫార్ములా-ఈ కేసు,ధరణి కేసు,జన్వాడ ఫామ్ హౌస్ కేసు,డ్రగ్స్ కేసు ఇవన్నీ ఎక్కడికి పోయాయి.జనాలని,మీడియాని కాంగ్రెస్, బీఆర్‌ఎస్ వాళ్లను పిచోళ్ళు చేస్తున్నారు. తెలంగాణకు ఇద్దరు ముఖ్యమంత్రులు ఒకరు కేటీఆర్, ఇంకొకరు రేవంత్‌రెడ్డి’అని బండి సంజయ్ ఎద్దేవా చేశారు.
Comments
Please login to add a commentAdd a comment