చీర కామెంట్స్‌... సీఎం రేవంత్‌కు కేటీఆర్‌ స్ట్రాంగ్ కౌంటర్‌ | Ktr Counter To Revanth Reddy On Saree Comments | Sakshi
Sakshi News home page

చీర కామెంట్స్‌... సీఎం రేవంత్‌కు కేటీఆర్‌ స్ట్రాంగ్ కౌంటర్‌

Published Sun, May 5 2024 4:12 PM | Last Updated on Sun, May 5 2024 5:25 PM

Ktr Counter To Revanth Reddy On Saree Comments

సాక్షి,హైదరాబాద్‌: చీరకట్టుకొని జూబ్లీహిల్స్‌లో బస్‌ ఎక్కి టికెట్‌ తీస్కో.. హామీలు అమలవుతున్నయా.. లేదా చెప్పు అన్న సీఎం రేవంత్‌రెడ్డి మాటలకు బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కౌంటర్‌ ఇచ్చారు. ఈ మేరకు ఎక్స్‌(ట్విటర్‌)లో కేటీఆర్‌ ఆదివారం(మే5) ట్వీట్‌ చేశారు. ‘చీర నువ్వు కట్టుకుంటావా లేదా రాహుల్ గాంధీకి కట్టిస్తావా? ఎక్కడ ఇస్తున్నారు నెలకు ₹2500 చుపిస్తావా? ఇన్ని పచ్చి అబద్ధాలా?

తెలంగాణలో ఉన్న ఒక కోటి 67 లక్షల మంది 18 ఏళ్లు నిండిన ఆడబిడ్డలు అడుగుతున్నారు నెలకు రూ.2500 ఏవి అని. వంద రోజుల్లో అన్నీ చేస్తానని మాట తప్పినందుకు కాంగ్రెస్‌ని బొంద పెట్టేది కూడా తెలంగాణ ఆడబిడ్డలే. డైలాగులేమో ఇందిరమ్మ రాజ్యం చేసేదేమో సోనియమ్మ జపం, కానీ మహిళా సంక్షేమంలో కాంగ్రెస్ సర్కారు పూర్తి వైఫల్యం.

కేసిఆర్ కిట్ ఆగింది, న్యూట్రిషన్‌ కిట్‌ బంద్‌ అయింది. కళ్యాణ లక్ష్మి నిలిచింది.తులం బంగారం అడ్రస్ లేదు.ఫ్రీ బస్సు అని బిల్డప్,అందులో సీట్లు దొరకవు, ముష్టి యుద్దాలు చేసే దుస్థితి.అన్నింటినీ అటకెక్కించిన కాంగ్రెస్‌కు మహిళల ఓట్లడిగే హక్కు లేదు. చిల్లర మాటలు ఉద్దెర పనులు తప్ప నువ్వు నీ అసమర్థ ప్రభుత్వం చేసిందేమి లేదు అని అందరికి తెలిసిపోయింది’ అని కేటీఆర్‌ రేవంత్‌కు చురకలంటించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement