సాక్షి,ఆదిలాబాద్: పార్లమెంట్ ఎన్నికల తర్వాత తెలంగాణలో ముఖ్యమైన మార్పులు జరుగుతాయని, ఇందులో ప్రధానమైన మార్పు సీఎం రేవంత్‌రెడ్డిదేనని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. మంగళవారం(ఏప్రిల్16) ఆదిలాబాద్‌లో జరగిన బీఆర్‌ఎస్ కార్యకర్తల మీటింగ్‌లో కేటీఆర్ మాట్లాడారు. కాంగ్రెస్‌లో గెలిచిన ఎంపీలను తీసుకుని రేవంత్ బీజేపీలోకి పోవడం ఖాయమన్నారు.
‘రాహుల్ గాంధీ మోదీ ని చౌకీదార్ చోర్ హై అంటే..రేవంత్‌రెడ్డి మాత్రం మా పెద్దన్న అంటున్నాడు. రాహుల్ గాంధీ గుజరాత్ మోడల్ ఫేక్ అంటే.. రేవంత్‌రెడ్డి తెలంగాణను గుజరాత్ చేస్తానంటున్నాడు. రాహుల్ అదానీ చొర్ అంటే రేవంత్ అదానీ ఫ్రెండ్‌ను అంటాడు. రాహుల్‌గాంధీ లిక్కర్ స్కామ్ జరగలేదు,కేజ్రీవాల్ అరెస్ట్ తప్పు అంటే రేవంత్ లిక్కర్ స్కాం జరిగింది కవితను,కేజ్రీవాల్‌ను అరెస్ట్ చేయడం సబబే అంటాడు.
రేవంత్ కాంగ్రెస్ పార్టీ కొసం పనిచేస్తున్నాడా లేక బీజేపీ కోసం పనిచేస్తున్నాడా?తెలంగాణలో జరగనున్న అన్ని ఎన్నికల్లో ఎగిరేది గులాబి జెండానే. జేబుల్లో కత్తెర పెట్టుకొని రేవంత్‌రెడ్డి తిరుగుతున్నాడు. పేగులు మెడలో వేసుకుంటా అంటున్నావ్..
అసలు నువ్వు ముఖ్యమంత్రివా బోటి కొట్టేటోడివా? మేం మీ ప్రభుత్వాన్ని కూలుస్తాం అని ప్రచారం చేస్తున్నావ్.. నువ్వు అయిదేళ్ళు ఉండాలి. ప్రజలు నిన్ను తరిమికొట్టాలి. బీజేపీ మేకిన్ ఇండియా అని మాటలు చెప్పి ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేస్తోంది. శ్రీరాముడిని మొక్కుదాం.. బీజేపీని తొక్కుదాం’ అని కేటీఆర్ పిలుపునిచ్చారు.
ఇదీ చదవండి.. కవితకు బ్యాడ్‌టైమ్.. బెయిల్ పిటిషన్‌పై విచారణ వాయిదా
Comments
Please login to add a commentAdd a comment