సాక్షి,హైదరాబాద్: సీఎం రేవంత్,బండి సంజయ్‌లు రహస్య మిత్రులని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సోమవారం(అక్టోబర్ 21)మీడియాతో మాట్లాడారు. రేవంత్ కుర్చీ పోతుంటే బండి సంజయ్‌కి బాధ ఎందుకని ప్రశ్నించారు. కాంగ్రెస్,బీజేపీ రహస్య ఒప్పందాలు ఖచ్చితంగా బయటకు వస్తాయన్నారు.
‘రాహుల్ గాంధీ అశోక్ నగర్‌కు వచ్చి కాంగ్రెస్ ప్రభుత్వ వార్షికోత్సవం జరుపుకోవాలి. ముత్యాలమ్మ గుడిపై దాడిని నేను ఖండిస్తే తప్పేంటి? నేను ట్వీట్ చేసినందుకు నాకు సైబర్ క్రైమ్ వాళ్ళు నాకు లేఖ పంపారు. రేవంత్ లాంటి దగుల్బాజీ ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేడు.ఉద్యోగాల కల్పనపై సీఎం రేవంత్ అబద్దాలు చెప్తున్నాడు.
మూసీ విషయంలో బీఆర్ఎస్ కంటే ఎక్కువ ప్రశ్నించాల్సింది జర్నలిస్టులు. లక్షన్నర కోట్లు మూసీలో పోద్దామంటే చూస్తూ ఊరుకుందామా? లక్షన్నర కోట్లు జేబులో వేసుకుంటామంటే ఊరుకుంటామా? జర్నలిస్టులపై బీఆర్‌ఎస్‌కు ఎనలేని గౌరవం ఉంది. ఎన్నడూ నేను అవమానించలేదు.ఉద్యమంలో మాకంటే ఎక్కువ జర్నలిస్టుల పాత్ర ఉంది’అని కేటీఆర్ పేర్కొన్నారు.
గ్రూప్ వన్‌పై సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం..
‘గ్రూప్ వన్‌పై హైకోర్టు నిర్ణయం తీసుకునే వరకు ఫలితాలు వెల్లడించవద్దన్న సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం.రిట్ పిటిషన్‌పై వేగంగా వాదనలు విని నిర్ణయం తీసుకోమని సుప్రీం హైకోర్టుకు చెప్పింది.జీవో 29కు వ్యతిరేకంగా హైకోర్టులో అభ్యర్థుల తరుపున కొట్లాడుతాం.
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని తెచ్చిందే నిరుద్యోగులు.స్థానికుల కోసం కేసీఆర్ 95శాతం రిజర్వేషన్లు తీసుకొచ్చారు.తెలుగు అకాడమీ పుస్తకాలు ప్రమాణికం కాదనటనం అన్యాయం. జీవో 29 వల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లకు విఘాతం కలుగుతుంది. గ్రూప్ - 1 అభ్యర్థుల తరుపున సుప్రీంకోర్టులో కేసు వేసిందే బీఆర్ఎస్.కపిల్ సిబల్ లాంటి ప్రముఖ న్యాయవాదిని నియమించాం’అని కేటీఆర్ తెలిపారు.
ఇదీ చదవండి: కేటీఆర్ ఇంటివద్ద భారీగా పోలీసులు
Comments
Please login to add a commentAdd a comment