సాక్షి, హైదరాబాద్ : ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు ఆన్‌లైన్ పద్ధతిలో పాఠాలు బోధించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించిన విషయం తెలిసిందే. రేపటి నుంచి(మంగళవారం) తెలంగాణలో ఆన్‌లైన్ ద్వారా విద్యార్థులకు స్కూల్ పాఠాలు బోధించనున్నారు. టీశాట్, ఆన్‌లైన్ ద్వారా ఈ విద్యాబోధన కార్యక్రమం జరగనుంది. ఇప్పటికే జూబ్లీహిల్స్ టీ శాట్ టీవీ స్టూడియోలో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సందర్భంగా టీ శాట్ సీఈఓ శైలేష్ రెడ్డి సాక్షి టీవీతో మాట్లాడుతూ.. రేపటి నుంచి 10 తరగతిలోపు విద్యార్థులకు ఆన్‌లైన్ , టీవీల ద్వారా పాఠాలు బోధిస్తామని వెల్లడించారు. (ఫస్ట్ నుంచి ఆన్‌లైన్ పాఠాలు)
టీశాట్ తీశాట్, తీశాట్ నిపుణ రెండు చానల్స్, వెబ్ సైట్, ఆన్‌లైన్ డిజిటల్, మొబైల్ యాప్ ద్వారా పాఠాలు చెప్పనున్నట్లు వెల్లడించారు.విద్యార్థుల సందేహాలు నివృత్తి చేయడానికి పాఠాలను సాయంత్రం వేళల్లో తిరిగి ప్రసారం చేస్తామని తెలిపారు. ఎక్కడ ఇబ్బందులు అనేవి ఉండవని, పవర్ కట్ ప్రాంతాల్లో మళ్ళీ పాఠ్యంశాలను తిరిగి ప్రసారం చేస్తామని, ప్రభుత్వం ఇచ్చిన షెడ్యూల్ ప్రకారం ప్రసారాలు ఉంటాయని శైలేష్ రెడ్డి వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment