తెలుగు రాష్ట్రాల్లో ఊహించని వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలోనే తెలుగు స్టార్ హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, మహేశ్ బాబు తదితరులు తలో రూ.50 లక్షలు విరాళం ప్రకటించారు. వీళ్లతో పాటు విశ్వక్ సేన్, సిద్ధు జొన్నలగడ్డ తదితరులు కూడా తోచిన మొత్తం ఇచ్చారు. ఇప్పుడు ఈ లిస్టులోకి ప్రభాస్, అల్లు అర్జున్ కూడా చేరారు.
(ఇదీ చదవండి: రెమ్యునరేషన్ వెనక్కి ఇచ్చిన డైరెక్టర్ హరీశ్ శంకర్!)
ఇప్పటివరకు ఇచ్చిన వాళ్లకంటే కాస్త ఎక్కువగానే ప్రభాస్ సాయం చేశాడు. రాష్ట‍్రానికి కోటి రూపాయలు చొప్పిన రూ.2 కోట్లు విరాళం ప్రకటించాడు. అంతకు ముందు రూ.5 కోట్లు అని అన్నారు. అయితే అది కేవలం పుకారు మాత్రమే అని తేలింది.
మరోవైపు అల్లు అర్జున్.. మొత్తంగా రూ.కోటి రూపాయలు విరాళం ప్రకటించాడు. అంటే తలో రాష్ట్రానికి రూ.50 లక్షలు. ఈ ఇద్దరి హీరోలు ఇవ్వడంతో అభిమానులకు కూడా తోచినంత సాయం చేయమని చెబితే బాగుండేది. సరే ఇదంతా పక్కనబెడితే మరికొందరు హీరోలు ఇంకా దీనిపై స్పందించి విరాళాలిస్తే బాగుంటుంది.
(ఇదీ చదవండి: దయనీయ స్థితిలో నటుడు ఫిష్ వెంకట్.. రెండు కిడ్నీలు ఫెయిల్)
Comments
Please login to add a commentAdd a comment