సాక్షి, వేల్పూరు(నిజామాబాద్): నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం వాడిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గత 14 నెలలుగా అంకం కిషన్ అనే రైతు కుటుంబానికి గ్రామాభివృద్ధి కమిటీ గ్రామ బహిష్కరణ విధించింది. నిత్యావసరాలు పాలు నీళ్ళు బియ్యము కిరాణా వస్తువులు ఏవీ ఇవ్వకుండా ఆంక్షలు విధించింది. చెంగల్ అనే గ్రామంలో కిషన్ మేనల్లుడు కొనుగోలు చేసిన భూమి విషయంలో కిషన్ సాయం చేశారని గ్రామాభివృద్ధి కమిటీ కక్ష్య కట్టింది. ఈ కమిటీ కిషన్ కుటుంబానికి ఐదు లక్షల 20 వేల రూపాయల జరిమానా వేసింది. కిరాణా షాపుల్లో కనీసం పిల్లలకు పాల ప్యాకెట్లు కూడా ఇవ్వని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి.. అత్త కోడళ్ళ కు బీడీ కార్ఖానాలలో పని ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు.
కిషన్ దంపతులు, ఇద్దరు కొడుకులు కోడళ్ళు నలుగురు పిల్లలు ఎనలేని కష్టాలు పడుతున్నారు. గ్రామాభివృద్ధి కమిటీ కట్టుబాట్లతో గ్రామస్తులు అందరూ సహాయ నిరాకరణ చేస్తున్నారు.14 నెలలుగా గ్రామంలో సహాయ నిరాకరణ కొనసాగుతోంది. వ్యవసాయంలో కూడా ఇబ్బందులు తలెత్తి ఐదు ఎకరాల జొన్న పంట కూడా నష్టపోయాం అని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 14 నెలలుగా తీవ్ర మనస్థాపానికి గురైన బాధితులు…గ్రామ బహిష్కరణ ఎత్తి వేయించి తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను కలిసి వేడుకున్నారు. మరోవైపు వాడి గ్రామాన్ని యాదవ సంఘం జాతీయ అధ్యక్షుడు రాములు సంఘ ప్రతినిదులు సందర్శించి బాధితులను పరామర్శించారు.
చదవండి: ఫోన్ సిగ్నల్ కోసం చెట్టెక్కిన పిల్లలు..కానీ ఇంతలోనే
Comments
Please login to add a commentAdd a comment