distric collecter
-
14 నెలలుగా రైతు కుటుంబం గ్రామ బహిష్కరణ..
సాక్షి, వేల్పూరు(నిజామాబాద్): నిజామాబాద్ జిల్లా వేల్పూరు మండలం వాడిలో దారుణ ఘటన చోటుచేసుకుంది. గత 14 నెలలుగా అంకం కిషన్ అనే రైతు కుటుంబానికి గ్రామాభివృద్ధి కమిటీ గ్రామ బహిష్కరణ విధించింది. నిత్యావసరాలు పాలు నీళ్ళు బియ్యము కిరాణా వస్తువులు ఏవీ ఇవ్వకుండా ఆంక్షలు విధించింది. చెంగల్ అనే గ్రామంలో కిషన్ మేనల్లుడు కొనుగోలు చేసిన భూమి విషయంలో కిషన్ సాయం చేశారని గ్రామాభివృద్ధి కమిటీ కక్ష్య కట్టింది. ఈ కమిటీ కిషన్ కుటుంబానికి ఐదు లక్షల 20 వేల రూపాయల జరిమానా వేసింది. కిరాణా షాపుల్లో కనీసం పిల్లలకు పాల ప్యాకెట్లు కూడా ఇవ్వని దయనీయ పరిస్థితులు నెలకొన్నాయి.. అత్త కోడళ్ళ కు బీడీ కార్ఖానాలలో పని ఇవ్వకుండా ఇబ్బందులు పెడుతున్నారు. కిషన్ దంపతులు, ఇద్దరు కొడుకులు కోడళ్ళు నలుగురు పిల్లలు ఎనలేని కష్టాలు పడుతున్నారు. గ్రామాభివృద్ధి కమిటీ కట్టుబాట్లతో గ్రామస్తులు అందరూ సహాయ నిరాకరణ చేస్తున్నారు.14 నెలలుగా గ్రామంలో సహాయ నిరాకరణ కొనసాగుతోంది. వ్యవసాయంలో కూడా ఇబ్బందులు తలెత్తి ఐదు ఎకరాల జొన్న పంట కూడా నష్టపోయాం అని బాధితుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 14 నెలలుగా తీవ్ర మనస్థాపానికి గురైన బాధితులు…గ్రామ బహిష్కరణ ఎత్తి వేయించి తమకు న్యాయం చేయాలని జిల్లా కలెక్టర్‌ను కలిసి వేడుకున్నారు. మరోవైపు వాడి గ్రామాన్ని యాదవ సంఘం జాతీయ అధ్యక్షుడు రాములు సంఘ ప్రతినిదులు సందర్శించి బాధితులను పరామర్శించారు. చదవండి: ఫోన్ సిగ్నల్ కోసం చెట్టెక్కిన పిల్లలు..కానీ ఇంతలోనే -
రీపోలింగ్‌కు కారణం ఎవరు?
సాక్షి, చిత్తూరు: సార్వత్రిక ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించడంలో జిల్లా ఎన్నికల యంత్రాంగం పూర్తిగా విఫలమైంది. ఎన్నికలను నిజాయితీగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్నామని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న మొదటి నుంచి చెబుతూనే వస్తున్నారు. అయితే ఆయన విధానం తెర ముందు ఒకలా, తెర వెనుక మరోలా ప్రవర్తించారనే విషయం ప్రస్తుతం తేటతెల్లమవుతోంది. ఏప్రిల్ 11న పోలింగ్ ముగిసిన వెంటనే పోలింగ్ ప్రశాంతంగా ముగిసిందని, రీపోలింగ్‌కు తావేలేదని స్పష్టంచేశారు. ఇదే విషయం ఈసీకి నివేదిక రూపంలో తెలియజేశారు. అయితే క్షేత్రస్థాయిలో పోలింగ్ రోజున పలు హింసాత్మక సంఘటనలు, టీడీపీ నేతలు దౌర్జన్యాలకు పాల్పడడం, దాడులకు తెగబడడం జరిగింది. పోలింగ్ రోజున పూతలపట్టు నియోజకవర్గంలో పలు పోలింగ్ కేంద్రాల్లో టీడీపీ నాయకులు రిగ్గింగ్‌కు పాల్పడుతున్నారని వైఎస్సార్సీపీ అభ్యర్థి ఎం.ఎస్.బాబుకు సమాచారం వచ్చింది. దీంతో ఆయన ఆ పోలింగ్ బూత్‌ల వద్దకు వెళ్తున్న సమయంలో టీడీపీ నాయకులు అడ్డగించి ఆయన్ను తీవ్రంగా గాయపరిచి తల పగులగొట్టారు. రామచంద్రాపురం మండలంలోని వైఎస్సార్సీపీ నాయకుడిపై టీడీపీ నాయకులు చేసిన దాడిలో గాయాలపాలయ్యారు. పెద్దతిప్పసముద్రం మండలంలో టీడీపీ నాయకుల దాడిలో వైఎస్సార్సీపీ నాయకుడు వెంకటరమణారెడ్డి మృతి చెందారు. ఇలా అనేక ఘటనలు, రిగ్గింగ్‌లు 14 నియోజకవర్గాల్లో యథేచ్ఛగా జరిగాయి. ఈ విషయాలన్నీ జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న, ఎస్పీ విక్రాంత్‌పాటిల్ దృష్టికి వచ్చినా తక్షణ చర్యలకు పాల్పడక నిర్లక్ష్యం చేశారు. జిల్లాలో జరిగిన ఘటనలపై వాస్తవ నివేదికలను ఈసీకి పంపకపోవడంతో ప్రస్తుతం జిల్లా ఎన్నికల అధికారి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పలువురు విమర్శిస్తున్నారు. అన్నీ అనుమానాలే.. పోలింగ్ రోజున జిల్లా వ్యాప్తంగా పోలింగ్ సరళిని పర్యవేక్షించేందుకు కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూంలో ఏప్రిల్ 10న అర్ధరాత్రి అనూహ్యంగా మంటలు చేలరేగి కాలిపోయింది. ఆ ఘటన మరుసటిరోజు ఆశ్చర్యానికి గురిచేసింది. టీడీపీ నాయకుల డైరెక్షన్లో పోలింగ్ జరిగే రోజున ఘటనలను పర్యవేక్షించకూడదనే ఉద్దేశంతోనే కమాండ్ కంట్రోల్ రూమ్‌ను కాల్చివేశారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. కమాండ్ కంట్రోల్ రూమ్ కాలిపోవడం వల్ల ఏప్రిల్ 11న జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్న జిల్లాలో జరుగుతున్న పోలింగ్ సరళిని పర్యవేక్షించలేక చాంబర్లోనే మిన్నకుండిపోయారు. దీంతో పలుచోట్ల టీడీపీ నేతలు ఇష్టానుసారంగా రిగ్గింగ్‌కు, హింసాత్మక దాడులకు పాల్పడ్డారనే విమర్శలున్నాయి. వేటుకు రంగం సిద్ధం ? పోలింగ్ ముందురోజున కలెక్టర్ ప్రద్యుమ్న తనతో మాట్లాడారని ఈవీఎంల దొంగతనం కేసులో నిందితుడు, టీడీపీ నాయకుడు వేమూరి హరిప్రసాద్ చౌదరి స్వయంగా ఇంటర్వ్యూలో చెప్పడం ఆశ్చర్యాన్ని కల్పించింది. అదేవిధంగా పోలింగ్ పూర్తయిన తరువాత జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లోని ఏడు పోలింగ్ బూత్‌ల ఈవీఎంలు స్ట్రాంగ్ రూమ్‌లో లేకుండా బయటే ఉంచారనే ఆరోపణలు గుప్పుమన్నాయి. ఇలా ప్రతి దాన్నీ గమనిస్తే జిల్లా ఎన్నికల అధికారి, ఎస్పీ టీడీపీ నేతలకు ఏమేరకు సహకరించారో అర్థమవుతోంది. చంద్రగిరి నియోజకవర్గంలో టీడీపీ నేతలు చేసిన రిగ్గింగ్ వీడియోలతో సహా రాష్ట్ర, కేంద్ర ఎన్నికల సంఘాల దృష్టికి వెళ్లడంతో వారు జిల్లా ఎన్నికల అధికారి ప్రద్యుమ్నపై, ఎస్పీ విక్రాంత్‌పాటిల్‌పై సీరియస్‌గా ఉన్నారని సమాచారం. ఎన్నికల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు, ఓ పార్టీకి మద్దతు పలుకుతూ పనిచేశారనే ఆరోపణలకు గాను వారిద్దరిపై వేటు వేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. -
పోరు షురూ
కర్నూలు శాసనసభ, లోక్‌సభ ఎన్నికలకు నగారా మోగింది. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాలకు, రెండు పార్లమెంటు నియోజకవర్గాలకు మే నెల 7వ తేదీన పోలింగ్ జరగనుంది. ఈ నేపథ్యంలో కోడ్ అమల్లోకి వచ్చింది. అధికార యంత్రాంగం ఏర్పాట్లపై దృష్టి సారించింది. మునిసిపల్, సాధారణ ఎన్నికలు ఒకేసారి రావడంతో రాజకీయం వేడెక్కుతోంది. ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లా కలెక్టర్ నియోజకవర్గాల వారీగా ఏడు టీములను(వీడియో సర్వే లైన్ టీమ్, వీడియో వీవింగ్ టీమ్, అకౌంటింగ్ టీమ్, ఫ్లయింగ్ స్క్వాడ్, స్టాటిస్టిక్ సర్వే లైన్స్ టీమ్, మెడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ టీమ్, సెక్టోరల్ ఆఫీసర్ టీమ్) నియమించారు. ఈ బృందాలకు బుధ, గురువారాల్లో శిక్షణనివ్వనున్నారు. అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా రిటర్నింగ్ ఆఫీసర్ల నియామకం కూడా పూర్తయింది. అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి ఏప్రిల్ 12న నోటిఫికేషన్ విడుదల కానుండగా.. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుంది. ఏప్రిల్ 19వ తేదీ వరకు నామినేషన్లు స్వీకరణ.. 21న పరిశీలన.. 23న నామినేషన్ల ఉప సంహరణకు అవకాశం కల్పించారు. మే నెల 7న పోలింగ్ నిర్వహించనుండగా.. 16న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. జిల్లా మొత్తం మీద 29,64,148 మంది ఓటర్లు ఈ ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 13,959 మంది అధికంగా ఉండటం విశేషం. ఎన్నికల్లో వీరు కీలకం కానున్నారు. జిల్లాలోని 14 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 3,258 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అయితే పట్టణ ప్రాంతాల్లో 1400, గ్రామీణ ప్రాంతాల్లో 1200 ఓటర్లు ఉన్న పోలింగ్ కేంద్రాలను విభజించడానికి అధికార యంత్రాంగం చర్యలు చేపట్టింది. ఈ మేరకు ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్ రిటర్నింగ్ అధికారులను ఆదేశించారు. ఎన్నికల వ్యయం లో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే మొద టి స్థానంలో ఉన్నట్లు వెల్లడయిం ది. ఈ దృష్ట్యా వ్యయ నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోనున్నారు. సాధారణ ఎన్నికల్లో పోటీలోని అభ్యర్థులు నచ్చకపోతే ఆ విషయాన్ని ఓటర్లు స్పష్టం చేసేందుకు ఎన్నికల కమిషన్ ఏర్పాట్లు చేపట్టింది. ఈవీఎం లోని బ్యాలెట్ యూనిట్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు, గుర్తులు ఉంటాయి. పేర్ల కింద నోటా(నన్ ఆఫ్ ది ఎబౌ) అనే బటన్ ఏర్పాటు చేశారు. పోటీలో ఉన్న వారెవరూ నచ్చకపోతే నోటా బటన్ నొక్కి ఓటరు అభిప్రాయం వెల్లడించే అవకాశం కల్పించారు.