తెలంగాణ డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ నియమితులైన విషయం తెలిసిందే. టీ20 ప్రపంచకప్ విజయంతో పాటు భారత జట్టుకు అందించిన సేవలకుగానూ సిరాజ్‌కు రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-1(డీఎస్పీ) ఉద్యోగంతో పాటు 600 చదరపు గజాల స్థలాన్ని కేటాయించింది. ఈ క్రమంలో తెలంగాణ డీజీపీ జితేందర్ తాజాగా సిరాజ్‌కు నియమాక పత్రాన్ని అందజేశారు.
ఈ నేపథ్యంలో పోలీస్ యూనిఫాంలో ఉన్న మహ్మద్ సిరాజ్ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అంతేకాకుండా సిరాజ్..డీజీపీని కలిసిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతున్నాయి. దీంతో ఈ భారత స్టార్ బౌలర్‌కు నెటిజన్లు కంగ్రాట్స్ తెలుపున్నారు.
Siraj is finally coming to arrest everyone who made his fake account. pic.twitter.com/zRCIWNc1A4
— Silly Point (@FarziCricketer) October 12, 2024
ఇక బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ అనంతరం సిరాజ్ విశ్రాంతి తీసుకుంటున్నాడు. ఆక్టోబర్ 16 నుంచి న్యూజిలాండ్‌తో జరగనున్న టెస్టు సిరీస్‌తో సిరాజ్ మియా మళ్లీ బీజీ కానున్నాడు. కివీస్‌తో సిరీస్‌కు ఎంపిక చేసిన 15 మంది సభ్యుల భారత జట్టులో సిరాజ్‌కు చోటు దక్కింది. ఈ సిరీస్‌లో సిరాజ్.. జస్ప్రీత్ బుమ్రా, ఆకాష్ దీప్‌తో వంటి పేసర్లతో కలిసి బంతిని పంచుకోనున్నాడు.
న్యూజిలాండ్‌తో జరిగే మూడు టెస్టుల కోసం భారత జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), జస్ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), యశస్వి జైస్వాల్, శుభ్‌మన్ గిల్, విరాట్ కోహ్లీ, కెఎల్ రాహుల్, సర్ఫరాజ్ ఖాన్, రిషబ్ పంత్ (డబ్ల్యుకె), ధృవ్ జురెల్ (డబ్ల్యుకె), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్, మొహమ్మద్. సిరాజ్, ఆకాష్ దీప్
ట్రావెలింగ్ రిజర్వ్స్: హర్షిత్ రాణా, నితీష్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్ ప్రసిద్ధ్ కృష్ణ
Congratulations Mohammad Siraj
for the post of DSP in Telangana State#MohammadSiraj #MohammedSiraj #Telangana pic.twitter.com/kfKtmebEkG— Rahul (@Rahul64590994) October 12, 2024
Comments
Please login to add a commentAdd a comment