బెంగళూరు వేదికగా న్యూజిలాండ్‌తో ప్రారంభమైన మొదటి టెస్టులో భారత్‌కు ఏదీ కలిసి రావడం లేదు. వర్షం కారణంగా తొలి రోజు ఆట తుడిచిపెట్టుకుపోవడంతో రెండో రోజు(గురువారం) మ్యాచ్ ప్రారంభమైంది. టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఘోర పరాభావం ఎదురైంది. న్యూజిలాండ్ బౌలర్ల దాటికి భారత్ కేవలం 46 పరుగులకే కుప్పకూలింది.
92 ఏళ్ల తమ టెస్టు క్రికెట్ హిస్టరీల భారత జట్టుకు స్వదేశంలో ఇదే అత్యల్ప స్కోర్ కావడం గమనార్హం. న్యూజిలాండ్ బౌలర్లలో మ్యాట్ హెన్రీ 5 వికెట్లు పడగొట్టగా.. రౌర్కీ 4 వికెట్లు తన ఖాతాలో వేసుకున్నాడు.
భారత బ్యాటర్లలో రిషబ్ పంత్(20) పరుగులతో టాప్ స్కోరర్‌గా నిలిచాడు. అనంతరం బ్యాటింగ్‌లో కూడా కివీస్ అదరగొడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి న్యూజిలాండ్ 3 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది.
అతడొక డీఎస్పీ..
కాగా రెండో రోజు ఆట సందర్భంగా ఓ ఆసక్తికర సంఘటన చోటు చేసుకుంది. తొలి ఇన్నింగ్స్‌లో కివీస్‌కు ఓపెనర్లు లాథమ్, కాన్వే మంచి ఆరంభాన్ని ఇచ్చారు. లాథమ్‌గా స్లోగా ఆడినప్పటకి మరో ఓపెనర్ డెవాన్ కాన్వే మాత్రం వన్డే తరహాలో తన ఇన్నింగ్స్‌ను కొనసాగించాడు.
ఈ క్రమంలో న్యూజిలాండ్ ఇన్నింగ్స్ 15వ ఓవర్ వేసిన మహ్మద్ సిరాజ్.. కాన్వేను స్లెడ్జ్ చేశాడు. ఆ ఓవర్‌లో మూడో బంతిని కాన్వే బౌండరీకి తరలించాడు. ఆ తర్వాత నాలుగో బంతిని డెవాన్ డిఫెండ్ చేశాడు. వెంటనే సిరాజ్ కాన్వే వైపు సీరియస్‌గా చూస్తూ ఏదో అన్నాడు.
కాన్వే మాత్రం సిరాజ్ మాటలను పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో కామెంటేటర్‌గా వ్యవహరిస్తున్న భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ ఫన్నీ వ్యాఖ్యలు చేశాడు. "అతడు ఇప్పుడు డీఎస్పీ అన్న విషయం మర్చిపోవద్దు. అతనికి సహచరులు సెల్యూట్ చేశారా? లేదా? ఒక వేళ చేస్తే కచ్చితంగా నేను షాక్ అవుతాను" అని గవాస్కర్ పేర్కొన్నాడు. టీ20 ప్రపంచకప్ 2024 గెలిచిన భారత జట్టులో సభ్యుడిగా ఉన్న మహమ్మద్ సిరాజ్‌కు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్-1 పోస్ట్ కింద డీఎస్పీ ఉద్యోగం ఇచ్చింది.
Siraj telling his real Instagram I'd to Conway pic.twitter.com/OMTZbP4VSY
— John_Snow (@MrSnow1981) October 17, 2024
Comments
Please login to add a commentAdd a comment