అడిలైడ్ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న పింక్‌బాల్ టెస్టులో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ తీరుపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మ్యాచ్‌లో రెండో రోజు ఆట సందర్భంగా ఆసీస్ స్టార్ బ్యాటర్ ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసిన అనంతరం సిరాజ్ మితిమీరి ప్రవర్తించాడు.
అద్భుతమైన యార్కర్‌తో హెడ్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన సిరాజ్.. అతడి వద్దకు వెళ్లి గట్టిగా అరుస్తూ సెలబ్రేషన్స్ చేసుకున్నాడు. అందుకు హెడ్ రియాక్ట్ కావడంతో సిరాజ్ మరింత రెచ్చిపోయాడు. ఆడింది చాలు ముందు ఇక్కడ నుంచి వెళ్లు అన్నట్లు సైగలు చేశాడు.
దీంతో పరిస్థితి ఒక్కసారిగా వేడెక్కింది. ఆ తర్వాత ఈ హైదరాబాదీ అసీస్ అభిమానుల అగ్రహానికి గురయ్యాడు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్‌ను చేస్తున్న సిరాజ్‌ను ఫ్యాన్స్ స్లెడ్జింగ్ చేశారు. దీంతో భారత కెప్టెన్ రోహిత్ శర్మ సిరాజ్ ఫీల్డింగ్ పొజిషన్‌ను మార్చేశాడు.
ఈ నేపథ్యంలో సిరాజ్‌పై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ అగ్రహం వ్యక్తం చేశాడు. అద్బుతమైన సెంచరీ చేసిన ఆటగాడి పట్ల సిరాజ్ ప్రవర్తించిన తీరు సరికాదని గవాస్కర్ మండిపడ్డాడు.
"సిరాజ్ అలా ప్రవర్తించడం సరి కాదు. హెడ్ అద్బుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. అతడేమి నాలుగైదు పరుగులు చేసి ఔట్ కాలేదు. 140 పరుగులు చేసిన ఆటగాడిని గౌరవించాల్సింది పోయి అంత ఆగ్రహాంగా సెంఢాఫ్ ఇవ్వాల్సిన అవసరం ఏముంది? సిరాజ్ ఇలా చేసినందుకు ఆసీస్ అభిమానుల నుంచి వచ్చిన ప్రతిస్పందన నన్ను ఏ మాత్రం ఆశ్చర్యపరచలేదు.
ట్రావిస్ హెడ్ లోకల్ హీరో. సెంచరీ చేసి ఔటైన తర్వాత సిరాజ్ చప్పట్లు కొట్టి అతడిని అభినందించి ఉంటే కచ్చితంగా హీరో అయ్యి ఉండేవాడు. కానీ మితి మీరి ప్రవర్తించడంతో సిరాజ్ ఇప్పుడు విలన్ అయ్యాడు" అని స్టార్ స్పోర్ట్స్ టీ టైమ్ షోలో సన్నీ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్‌లో సిరాజ్ 4 వికెట్లు పడగొట్టాడు.
చదవండి: IND vs AUS: జస్ప్రీత్ బుమ్రాకు గాయం.. కీలక అప్‌డేట్ ఇచ్చిన బౌలింగ్ కోచ్
Comments
Please login to add a commentAdd a comment