అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో 10 వికెట్ల తేడాతో టీమిండియాను ఆతిథ్య ఆస్ట్రేలియా చిత్తు చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ మ్యాచ్‌లో ఆసీస్ విజయం కన్న స్టార్ ప్లేయర్లు ట్రావిస్ హెడ్, మహ్మద్ సిరాజ్‌ల మధ్య జరిగిన వాగ్వాదమే ఎక్కువగా హైలెట్ అయింది.
రెండో రోజు ఆట సందర్భంగా ఈ స్టార్ ఆటగాళ్ల మధ్య చిన్నపాటి మాటల యుద్దం చోటు చేసుకుంది. సెంచరీతో చెలరేగిన హెడ్(140)ను సిరాజ్ అద్భుతమైన బంతితో క్లీన్ బౌల్డ్ చేశాడు. మంచి ఊపుమీద ఉన్న సిరాజ్ ట్రావిస్ హెడ్‌ను పెవీలియన్‌కు వెళ్లాల్సిందిగా సైగ చేశాడు.
హెడ్ కూడా బౌల్డ్ అయ్యాక సిరాజ్‌ను ఏదో అనడం కెమెరాలో రికార్డు అయింది. ఇదే విషయంపై రెండో రోజు ఆట అనంతరం వారిద్దరూ స్పందించారు.
బాగా బౌలింగ్ చేశావని సిరాజ్‌ను మెచ్చుకున్నాని, అతడు తప్పుగా ఆర్ధం చేసుకున్నాడని హెడ్ తెలిపాడు. సిరాజ్ మాత్రం హెడ్ అబద్దం చెబుతున్నాడని పేర్కొన్నాడు. ఏదమైనప్పటికి వీరిద్దరూ వివాదం క్రికెట్ వర్గాల్లో హాట్‌టాపిక్‌గా మారింది.
ఐసీసీ సీరియస్..!
ఈ క్రమంలో వీరిద్దరిపై అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) చర్యలకు సిద్దమైనట్లు తెలుస్తోంది. ది డైలీ టెలిగ్రాఫ్ నివేదిక ప్రకారం.. సిరాజ్, హెడ్ ఇద్దరూ ఐసీసీ క్రమశిక్షణా విచారణను ఎదుర్కోనున్నట్లు సమాచారం.
అయితే ఐసీసీ ప్రవర్తనా నియమావళిని వీరిద్దరూ పూర్తి స్ధాయిలో ఉల్లఘించకపోవడంతో సస్పెన్షన్ నుంచి తప్పించుకోనున్నారు. ఇది నిజంగా ఇరు జట్లు బిగ్ రిలీఫ్ అనే చెప్పుకోవాలి. అయితే ఐసీసీ వీరిద్దరిని కేవలం మందలింపుతో విడిచిపెట్టే అవకాశముంది.
చదవండి: జట్టులో బుమ్రా ఒక్కడే లేడు కదా.. అందరూ ఆ బాధ్యత తీసుకోవాలి: రోహిత్
Comments
Please login to add a commentAdd a comment