అడిలైడ్ వేదికగా జరిగిన పింక్ బాల్ టెస్టులో ఆసీస్ స్టార్ ట్రావిస్ హెడ్, మహ్మద్ సిరాజ్ మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. హెడ్‌ను అద్బుతమైన యార్కర్‌తో ఔట్ చేసిన అనంతరం సిరాజ్.. కాస్త దూకుడుగా సెలబ్రేషన్స్ చేసుకున్నాడు.
అందుకు హెడ్ సైతం ఏదో అంటూ కౌంటరిచ్చాడు. దీంతో సిరాజ్ మరింత సీరియస్ అయ్యాడు. ఇక్కడి నుంచి త్వరగా వెళ్లిపో అన్నట్లు సైగలు చేశాడు. ఈ క్రమంలో సిరాజ్ తీరును చాలా మంది తప్పుబట్టారు. ఇదే విషయంపై రెండో రోజు ఆట అనంతరం ట్రావిస్ హెడ్ స్పందించాడు.
హెడ్ మాట్లాడుతూ.. తాను బాగా బౌలింగ్ చేశావని సిరాజ్‌ను మెచ్చుకున్నానని, అంతకుమించి ఏమి అనలేదని చెప్పుకొచ్చాడు. కానీ సిరాజ్ మాత్రం తన మాటలను తప్పుగా ఆర్ధం చేసుకున్నాడని, అతడి ప్రవర్తన చూసి ఆశ్చర్యపోయానని ఈ ఆసీస్ స్టార్ తెలిపాడు. అయితే తాజాగా హెడ్ వ్యాఖ్యలకు సిరాజ్ కౌంటరిచ్చాడు. హెడ్ అబద్దం చెబుతున్నాడని, నిజంగానే హెడ్ దుర్భాషలాడాడని సిరాజ్
"ట్రావిస్ హెడ్‌ను ఔట్ చేసిన తర్వాత నేను నా స్టైల్లో సంబరాలు చేసుకున్నాను. ఆ తర్వాత నన్ను అతడు దుర్భాషలాడాడు. ఇది లైవ్‌లో కూడా కన్పించింది. కావాలంటే ఇప్పుడు టీవీ రిప్లేలో కూడా చూడవచ్చు.
నా సెలబ్రేషన్స్‌ను నేను చేసుకున్నా అంతే. అతడిని నేను ఏమి అనలేదు. విలేకరుల సమావేశంలో అతడు అబద్దం చెప్పాడు. అతడు నన్ను బాగా బౌలింగ్ చేశావని అనలేదు. మేము ప్రతీ ఒక్క ప్లేయర్‌ను గౌరవిస్తాము.
ఎందుకంటే క్రికెట్‌ను జెంటిల్‌మన్ గేమ్‌గా భావిస్తాము కాబట్టి. ట్రావిస్ హెడ్ తీరు నాకు నచ్చలేదు" అని స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సిరాజ్ పేర్కొన్నాడు. కాగా ఈ మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది.
చదవండి: IND vs AUS 2nd Test: పింక్ బాల్ టెస్టులో టీమిండియా ఘోర ఓటమి..
Comments
Please login to add a commentAdd a comment