భారత దేశవాళీ టోర్నీ రంజీ ట్రోఫీ 2024-25 సీజన్ ప్రారంభమైన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ టోర్నీలో గ్రూపు స్టేజి మ్యాచ్‌లు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఆక్టోబరు 11న మొదలైన ఈ ప్రతిష్టాత్మక టోర్నీ వచ్చే ఏడాది మార్చి 2 వరకు జరగనుంది.
అయితే ప్రస్తుత సీజన్‌లో చాలా మంది ఆటగాళ్లు తమ రాష్ట్ర జట్ల తరపున ఆడేందుకు అందుబాటులో లేరు. స్వదేశంలో న్యూజిలాండ్‌తో జరుగుతున్న టెస్టులతో సీనియర్ జట్టు బిజీగా ఉండగా.. తిలక్ వర్మ నేతృత్వంలోని భారత ‘ఎ’ జట్టు ఒమన్‌లో ఎమర్జింగ్ ఆసియాకప్‌లో ఆడుతోంది. దీంతో దాదాపుగా 30 నుంచి 40 మధ్య ఆటగాళ్లు రంజీ ట్రోఫీకి దూరంగా ఉన్నట్లే.
ఈ నేపథ్యంలో భారత మాజీ క్రికెటర్ సునీల్ గవాస్కర్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఆటగాళ్లు తమ రాష్ట్ర జట్ల నుంచి వైదొలగడం వల్ల ప్రతిష్టాత్మక రంజీ ట్రోఫీవిలువ తగ్గుతోందని గవాస్కర్ అవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా వచ్చే నెలలో దక్షిణాఫ్రికాతో టీ20 సిరీస్‌ను ఎందుకు షెడ్యూల్ చేశారో ఆర్ధం కావడం లేదని ఆయన అన్నారు.
"ఒకవైపు న్యూజిలాండ్‌తో టెస్టు సిరీస్‌తో భారత సీనియర్ ఆటగాళ్లు బీజీగా ఉన్నారు. మరోవైపు యువ భారత క్రికెటర్లు ఆసియా కప్‌లో ఆడుతున్నారు. ఈ క్రమంలో రంజీ ట్రోఫీ సీజన్ కూడా ప్రారంభమైంది. ఆటగాళ్లంతా ఇతర ఈవెంట్‌లలో ఆడేందుకు వెళ్లిపోతున్నారు.
దీంతో జాతీయ టోర్నమెంట్(రంజీ ట్రోఫీ) విలువ రోజు రోజుకు తగ్గిపోతోంది. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ముందు భారత జట్టు నాలుగు మ్యాచ్‌ల టీ20 సిరీస్ ఆడేందుకు దక్షిణాఫ్రికాకు వెళ్లనుంది. అసలు ఈ సిరీస్ అవసరమా? అంతేకాకుండా భారత-ఎ జట్టు కూడా కూడా ఆస్ట్రేలియా పర్యటనకు వెళ్లనుంది.
ఈ నేపథ్యంలో దాదాపు 50 నుండి 60 మంది ఆటగాళ్లు రంజీ ట్రోఫీలో తమ రాష్ట్ర జట్లకు అందుబాటులో ఉండరు. ఇతర దేశ క్రికెట్ బోర్డులు ఏవీ కూడా భారత్‌లా వారి దేశీవాళీ టోర్నీలను చిన్నచూపు చూడలేదు.
ఇంగ్లండ్ లేదా ఆస్ట్రేలియా జట్లు తమ దేశవాళీ టోర్నీల కోసం 'ఎ' జట్ల పర్యటనలను కూడా వాయిదా వేసుకున్న సందర్భాలు ఉన్నాయి. ముఖ్యంగా ఐపీఎల్ వచ్చినప్పటి నుంచి రంజీ ట్రోఫీని చాలా మంది నిర్లక్ష్యం చేస్తున్నారు. వచ్చే దేశవాళీ సీజన్ నుంచి అయినా ఈ పరిస్థితి మారుతుందా? అని స్పోర్ట్స్ స్టార్‌కు రాసిన తన కాలమ్‌లో గవాస్కర్ పేర్కొన్నారు.
చదవండి: ఓవర్ వెయిట్..! టీమిండియా ఓపెనర్‌కు ఊహించని షాక్?
Comments
Please login to add a commentAdd a comment