
PC: Jio Cinema
క్రికెటర్ కేఎల్ రాహుల్‌పై టీమిండియా అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జట్టుకు ఉపయోగపడే పనులేవీ చేతకావా అంటూ మండిపడుతున్నారు. బ్యాటింగ్‌తో పాటు.. ఫీల్డింగ్‌లోనూ విఫలం కావడాన్ని విమర్శిస్తూ ట్రోల్ చేస్తున్నారు. కాగా రోహిత్ సేన న్యూజిలాండ్‌తో స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతోంది.
వర్షం కారణంగా
ఇందులో భాగంగా బెంగళూరు వేదికగా బుధవారం మొదలు కావాల్సిన మ్యాచ్ వర్షం కారణంగా గురువారం మొదలైంది. ఈ క్రమంలో రెండో రోజు ఆటలో టాస్ గెలిచిన భారత్ తొలుత బ్యాటింగ్ ఎంచుకుంది. న్యూజిలాండ్ బౌలర్ల విజృంభణ కారణంగా 46 పరుగులకే ఆలౌట్ అయింది.
పరుగుల ఖాతా తెరవకుండానే
భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి, సర్ఫరాజ్ ఖాన్, కేఎల్ రాహుల్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్ డకౌట్ కావడం తీవ్ర ప్రభావం చూపింది. ఇక ఈ మ్యాచ్‌లో కివీస్ యువ పేసర్ విలియం రూర్కీ వేసిన బంతిని తప్పుగా అంచనా వేసిన కేఎల్ రాహుల్.. అజాజ్ పటేల్‌కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు.
ఈజీ క్యాచ్ మిస్ చేసిన రాహుల్
ఇక ఇలా బ్యాటింగ్‌లో విఫలమై పరుగుల ఖాతా తెరవకుండానే అవుటైన రాహుల్.. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ ఆరంభంలోనే ఈజీ క్యాచ్‌ను వదిలేశాడు. పదమూడవ ఓవర్లో భారత పేసర్ మహ్మద్ సిరాజ్ వేసిన రెండో బంతి.. కివీస్ ఓపెనర్ టామ్ లాథమ్ బ్యాట్‌ను తాకి అవుట్‌సైడ్ ఎడ్జ్ తీసుకుంది. ఈ క్రమంలో స్లిప్స్‌లో ఫీల్డింగ్ చేస్తున్న కోహ్లి, రాహుల్ మధ్య సమన్వయ లోపం ఏర్పడింది.
అయితే, బంతి తన వైపునకే వస్తున్నా రాహుల్ క్యాప్ పట్టడంలో నిర్లక్ష్యం వహించాడు. దీంతో రాహుల్ చేతిని తాకి మిస్ అయిన బాల్.. బౌండరీ వైపు వెళ్లింది. దీంతో కివీస్ ఖాతాలో నాలుగు పరుగులు చేరాయి.
రోహిత్ శర్మ ఆగ్రహం
ఈ క్రమంలో బౌలర్ సిరాజ్ తీవ్ర అసంతృప్తికి లోనుకాగా.. కెప్టెన్ రోహిత్ శర్మ సైతం.. ‘‘అసలేం ఏం చేశావు నువ్వు?’’ అన్నట్లుగా రాహుల్‌వైపు చూస్తూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఈ క్రమంలో రాహుల్ కావాలనే క్యాచ్ విడిచిపెట్టినట్లుగా ఉందంటూ టీమిండియా ఫ్యాన్స్ ఫైర్ అవుతున్నారు.
చదవండి: NZ vs IND 1st Test: రోహిత్ శర్మ తప్పు చేశాడా?
You can't convince me that kl Rahul didn't drop this catch intentionally.
Rohit Sharma is surrounded by snakes. 💔
pic.twitter.com/ASh7qzHbBO— Vishu (@Ro_45stan) October 17, 2024