
సంగారెడ్డి: సంక్రాంతి సందర్భంగా కొత్త అల్లుళ్లకు 108 రకాల వంటలతో విందును ఏర్పాటు చేశారు. ఆదివారం సంగారెడ్డి జిల్లా శాంతినగర్ మాజీ సర్పంచ్ మంగ రాములు నివాసంలో ఈ విందును ఘనంగా నిర్వహించారు. ఇటీవల మంగరాములు రెండవ కుమార్తె డాక్టర్ నిషాకు డాక్టర్ శ్రీకాంత్‌తో వివాహం జరిపించారు. అలాగే, సినీ నటుడు ఏడిద రాజా కుమార్తె మేఘన వివాహాన్ని లక్ష్మణ్ యాదవ్‌తో జరిపారు. ఈ రెండు కొత్త జంటలను విందుకుఅహ్వనించారు. ఈ సందర్భంగా 108 వంటకాలను తయారు చేసి వారికి వడ్డించారు.
Comments
Please login to add a commentAdd a comment