
కాన్పూర్: భారత క్రికెట్ జట్టు వన్డే వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ సరికొత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. వన్డే ఫార్మాట్ లో 150 సిక్సర్లను అత్యంత తక్కువ ఇన్నింగ్స్ ల్లో సాధించిన తొలి భారత క్రికెటర్ గా రోహిత్ రికార్డు నెలకొల్పాడు. 17 1 మ్యాచ్ ల్లో 165 ఇన్నింగ్స్ ల్లో రోహిత్ 150వ వన్డే సిక్సర్ ను సాధించాడు. ఇది భారత తరపున వేగవంతమైన మైలురాయి. న్యూజిలాండ్ తో ఇక్కడ ఆదివారం జరిగిన మూడో వన్డేలో రోహిత్ ఈ ఘనత సాధించాడు. ఆ మ్యాచ్ లో రెండు సిక్సర్లు సాధించిన రోహిత్ శర్మ.. 150 సిక్సర్ల క్లబ్ లో చేరిపోయాడు.
ఓవరాల్ గా చూస్తే ఈ ఫీట్ ను తక్కువ ఇన్నింగ్స్ ల్లో సాధించిన రెండో క్రికెటర్ రోహిత్ శర్మ. ఇక్కడ పాకిస్తాన్ మాజీ క్రికెటర్ షాహిద్ ఆఫ్రిది తొలి స్థానంలో ఉన్నాడు. 160 ఇన్నింగ్స్ ల్లోనే 150 సిక్సర్ల మార్కును చేరి అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు. ఇక192 ఇన్నింగ్స్ ల్లో 150 సిక్సర్ల మార్కును చేరిన మహేంద్ర సింగ్ ధోని భారత తరపున రెండో స్థానంలో ఉన్నాడు.ఓవరాల్ గా ఈ ఫీట్ ను తక్కువ ఇన్నింగ్స్ ల్లో సాధించిన ఐదో క్రికెటర్ ధోని. ఇక్కడ ఏబీ డివిలియర్స్ మూడో స్థానంలో, క్రిస్ కెయిన్స్ నాల్గో స్థానంలో ఉన్నారు. వీరిలో ప్రస్తుతం క్రికెట్ ఆడుతున్న ధోని, ఏబీ డివిలియర్స్ లు రెండొందల వన్డే సిక్సర్లను దాటిన ఆటగాళ్లు.
Comments
Please login to add a commentAdd a comment