రోహిత్ శర్మ (ఫైల్)
ఫ్లోరిడా: టీమిండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ మరో రికార్డు ముంగిట నిలిచాడు. అంతర్జాతీయ టి20ల్లో అత్యధిక సిక్సర్ల రికార్డుకు నాలుగు అడుగుల దూరంలో ఉన్నాడు. మరో నాలుగు సిక్సర్లు బాదితే వెస్టిండీస్ విధ్వంసక బ్యాట్స్‌మన్ క్రిస్ గేల్ పేరిట ఉన్న రికార్డు రోహిత్ సొంతమవుతుంది. 105 సిక్సర్లతో గేల్ టాప్‌లో ఉన్నాడు. న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్ 103 సిక్సర్లతో రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. థర్డ్ ప్లేస్‌లో ఉన్న రోహిత్ ఖాతాలో 102 సిక్సర్లు ఉన్నాయి.
శనివారం వెస్టిండీస్‌తో టీమిండియా ఆడబోయే తొలి టి20ల్లో అత్యధిక సిక్సర్ల రికార్డును రోహిత్ సొంతం చేసుకోవాలని టీమిండియా అభిమానులు కోరుకుంటున్నారు. వన్డే ప్రపంచకప్‌లో అత్యధిక పరుగుల వీరుడిగా నిలిచిన రోహిత్ ఈ రికార్డును సాధిస్తాడని విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. 94 మ్యాచ్‌ల్లో 86 ఇన్నింగ్స్ ఆడిన రోహిత్ 2,331 పరుగులు సాధించాడు. ఇందులో 4 సెంచరీలు, 16 అర్ధసెంచరీలు ఉన్నాయి. అయితే క్రిస్ గేల్ 58 మ్యాచ్‌ల్లోనే 105 సిక్సర్లు కొట్టడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment