విండీస్‌తో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా పూర్తి ఆధిక్యం దిశగా పయనిస్తుంది. మూడో రోజు ఆట ప్రారంభం కాగానే ఓవర్‌నైట్ బ్యాటర్ యశస్వి 150 పరుగుల మార్కును దాటేశాడు. ఈ క్రమంలో అతను టెస్ట్ డెబ్యూలో 150 పరుగుల మార్కును అందుకున్న ఐదో అతి పిన్న వయస్కుడిగా, అతి చిన్న వయసులో ఈ ఫీట్ సాధించిన తొలి భారత క్రికెటర్‌గా రికార్డుల్లోకెక్కాడు. యశస్వి 21 సంవత్సరాల 196 రోజుల వయసులో టెస్ట్ అరంగేట్రంలో 150 పరుగుల మార్కును దాటగా.. ఈ ఘనత సాధించిన అతి పిన్న వయస్కుడిగా పాక్ మాజీ క్రికెటర్ జావిద్ మియాందాద్ కొనసాగుతున్నాడు.
మియాందాద్.. 19 ఏళ్ల 119 రోజుల వయసులో తన తొలి టెస్ట్‌లో 150 పరుగుల మార్కును దాటాడు. అతని తర్వాత ఆసీస్ ఆర్కీ జాక్సన్ (19 ఏళ్ల 149 రోజులు), ఆసీస్ డౌగ్ వాల్టర్స్ (19 ఏళ్ల 354 రోజులు), జార్జ్ హెడ్లీ (20 ఏళ్ల 226 రోజులు) వరుసలో ఉన్నారు. వీరి తర్వాత అత్యంత పిన్న వయసులో 150 పరుగుల మార్కు దాటిన ఆటగాడిగా యశస్వి రికార్డుల్లోకెక్కాడు.
ఇదిలా ఉంటే, మూడో రోజు ఆట ప్రారంభం కాగానే జేసన్ హోల్డర్ వేసిన మూడో ఓవర్లో బౌండరీ, సింగల్ బాది యశస్వి 150 పరుగుల మార్కును అందుకున్నాడు. 359 బంతుల్లో అతను 150 మార్కును దాటాడు. 121 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 330/2గా ఉంది. యశస్వి (156)కి జతగా విరాట్ కోహ్లి (41) క్రీజ్‌లో ఉన్నాడు. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన విండీస్ తొలి ఇన్నింగ్స్‌లో 150 పరుగులకు ఆలౌటైంది. అశ్విన్ (5/60), జడేజా (3/26) విండీస్ పతనాన్ని శాసించారు. భారత ఇన్నింగ్స్‌లో కెప్టెన్ రోహిత్ శర్మ (103) శతక్కొట్టగా.. శుభ్‌మన్ గిల్ (6) విఫలమయ్యాడు.
Comments
Please login to add a commentAdd a comment