Ashes 1st Test: ఉస్మాన్‌ ఖ్వాజా శతకం.. పోరాడుతున్న ఆస్ట్రేలియా | ENG VS AUS 1st Ashes Test: Usman Khawaja Completes Ton | Sakshi
Sakshi News home page

Ashes 1st Test: ఉస్మాన్‌ ఖ్వాజా శతకం.. పోరాడుతున్న ఆస్ట్రేలియా

Published Sat, Jun 17 2023 9:25 PM | Last Updated on Sat, Jun 17 2023 9:25 PM

ENG VS AUS 1st Ashes Test: Usman Khawaja Completes Ton - Sakshi

ఎడ్జ్‌బాస్టన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌ తొలి టెస్ట్‌లో పర్యాటక ఆస్ట్రేలియా పోరాడుతుంది. 67 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో ఉండిన ఆ జట్టును ఉస్మాన్‌ ఖ్వాజా (102 నాటౌట్‌) సెంచరీతో ఆదుకున్నాడు. ట్రవిస్‌ హెడ్‌ (50) సాయంతో అతను ఇన్నింగ్స్‌ను నిర్మించాడు. టెస్ట్‌ల్లో ఖ్వాజాకు ఇది 15వ శతకం. 2022 నుంచి భీకర ఫామ్‌లో ఉన్న ఖ్వాజా ఈ మధ్యకాలంలో ప్రపంచ క్రికెట్‌లో అందరు బ్యాటర్ల కంటే అధికంగా 7 శతకాలు బాదాడు. 2022 నుంచి ఖ్వాజా, జో రూట్‌ మాత్రమే టెస్ట్‌ల్లో 7 సెంచరీలు చేశారు. వీరి తర్వాత జానీ బెయిర్‌స్టో 6 సెంచరీలు చేశాడు. 

కాగా, ఉస్మాన్‌ ఖ్వాజా సెంచరీతో ఆదుకోవడంతో ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్‌లో ఇంగ్లండ్‌కు ధీటుగా సమాధానం ఇచ్చే ప్రయత్నం‍ చేస్తుంది. ఆ జట్టు 70 ఓవర్లు పూర్తయ్యే సమయానికి 5 వికెట్ల నష్టానికి 230 పరుగులు చేసి ఇంగ్లండ్‌ తొలి ఇన్నింగ్స్‌ స్కోర్‌కు ఇంకా 163 పరుగులు వెనుకపడి ఉంది. ఖ్వాజాకు జతగా అలెక్స్‌ క్యారీ (3) క్రీజ్‌లో ఉన్నాడు.    

14/0 స్కోర్‌ వద్ద రెండో రోజు ఆటను ప్రారంభించిన ఆసీస్‌.. తొలి సెషన్‌లోనే వార్నర్‌ (9), లబూషేన్‌ (0), స్టీవ్‌ స్మిత్‌ (16), హెడ్‌ (50), గ్రీన్‌ (38) వికెట్లు కోల్పోయింది. స్టువర్ట్‌ బ్రాడ్‌, మొయిన్‌ అలీలకు తలో 2 వికెట్లు, స్టోక్స్‌కు ఓ వికెట్‌ (స్మిత్‌) దక్కింది. అంతకుముందు టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌.. రూట్‌ (118 నాటౌట్‌), జాక్‌ క్రాలే (61), బెయిర్‌స్టో (78) రాణించగా 393/8 స్కోర్‌ వద్ద తొలి ఇన్నింగ్స్‌ను డిక్లేర్‌ చేసింది. ఆసీస్‌ బౌలర్లలో నాథన్‌ లయోన్‌ 4, హాజిల్‌వుడ్‌ 2, బోలండ్‌, గ్రీన్‌ తలో వికెట్‌ పడగొట్టారు. 

చదవండి: Ashes 1st Test: సుదీర్ఘ విరామం తర్వాత ఇంగ్లండ్‌ బౌలర్‌ ఖాతాలో వికెట్‌

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement