Ashes 1st Test: ట్రావిస్‌ హెడ్‌ సుడిగాలి సెంచరీ.. పటిష్ట స్థితిలో ఆసీస్‌ | Ashes 1st Test Day 2: Travis Head Century Puts Australia In Command Against England | Sakshi
Sakshi News home page

Aus Vs Eng Ahses 1st Test: ట్రావిస్‌ హెడ్‌ సుడిగాలి సెంచరీ.. పటిష్ట స్థితిలో ఆసీస్‌

Published Thu, Dec 9 2021 7:45 PM | Last Updated on Thu, Dec 9 2021 8:13 PM

Ashes 1st Test Day 2: Travis Head Century Puts Australia In Command Against England - Sakshi

Travis Head Century Puts Australia In Command Against England In Ashes 1st Test: ఇంగ్లండ్‌తో జరుగుతున్న యాషెస్‌ సిరీస్‌ తొలి టెస్ట్‌లో ఆతిధ​ ఆస్ట్రేలియా పటిష్ట స్థితికి చేరుకుంది. రెండో రోజు ఆటలో వార్నర్(94), లబూషేన్(74) అర్థ శతకాలకు ట్రావిస్‌ హెడ్‌(95 బంతుల్లో 112 నాటౌట్‌; 12 ఫోర్లు, 2 సిక్సర్లు) సుడిగాలి శతకం తోడవ్వడంతో ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోర్‌ దిశగా సాగుతోంది. 

రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆసీస్ 7 వికెట్ల నష్టానికి 343 పరుగులు చేసింది. అంతకుముందు టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న ఇంగ్లండ్‌ ఆసీస్‌ పేసర్లు కమిన్స్‌(5/83), హేజిల్‌వుడ్‌(2/42), స్టార్క్‌(2/35), గ్రీన్‌(1/6) ధాటికి తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులకే కుప్పకూలింది. ఇంగ్లండ్‌ ఇన్నింగ్స్‌లో బట్లర్‌(39) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు. ప్రస్తుతం ఆసీస్ 196 పరుగుల తొలి ఇన్నింగ్స్ ఆధిక్యంలో కొనసాగుతోంది. మరో మూడు రోజుల ఆట మిగిలుండటంతో ఈ టెస్ట్‌లో ఆసీస్‌ విజయం ఖాయంగా కనిపిస్తోంది. 
చదవండి: Rohit Sharma: అచ్చొచ్చిన డిసెంబర్‌.. మరో ఘనత కూడా ఇదే నెలలోనే..!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement