Ashes 1st Test: ఆసీస్‌ బౌలర్‌ ఖాతాలో పలు అరుదైన రికార్డులు | Nathan Lyon Becomes Second Non Asian Spinner To Take 400 Test Wickets | Sakshi
Sakshi News home page

Ashes 1st Test: ఆసీస్‌ బౌలర్‌ ఖాతాలో పలు అరుదైన రికార్డులు

Published Sat, Dec 11 2021 6:35 PM | Last Updated on Sat, Dec 11 2021 6:35 PM

Nathan Lyon Becomes Second Non Asian Spinner To Take 400 Test Wickets - Sakshi

Nathan Lyon: యాషెస్‌ సిరీస్‌ 2021-22లో భాగంగా బ్రిస్బేన్‌ వేదికగా ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టెస్ట్‌లో ఆస్ట్రేలియా స్పిన్న‌ర్ నాథ‌న్ లియోన్ పలు అరుదైన ఘ‌న‌త‌లను సాధించాడు. ఈ మ్యాచ్‌లో డేవిడ్‌ మలాన్‌ను ఔట్‌ చేయడం ద్వారా టెస్టుల్లో 400 వికెట్లు పడగొట్టిన లియోన్‌.. ఈ ఘనత సాధించిన తొలి నాన్‌ ఏషియన్‌ ఆఫ్‌ స్పిన్నర్‌గా, రెండో నాన్‌ ఏషియన్‌ స్పిన్‌ బౌలర్‌గా(షేన్‌ వార్న్‌(708)), మూడో ఆసీస్‌ బౌలర్‌గా(వార్న్‌, మెక్‌గ్రాత్‌(563)), ఓవరాల్‌గా ఈ ఘనత సాధించిన17వ బౌలర్‌గా పలు రికార్డులను తన పేరిట లిఖించుకున్నాడు. 


34 ఏళ్ల నాథ‌న్ లియోన్ ఈ మ్యాచ్‌లో 4 వికెట్లు పడగొట్టడం ద్వారా 101 టెస్ట్‌ల్లో 403 వికెట్లు సాధించాడు. కాగా, ఈ మ్యాచ్‌లో మరో విశేషం కూడా ఉంది. లియోన్‌ గతేడాది జనవరిలో ఇదే వేదికపై తన 399వ వికెట్‌ సాధించాడు. నాటి నుంచి దాదాపు ఏడాదిపాటు ఒక్క వికెట్‌ కోసం ఎదురు చూసిన లియోన్‌.. ఈ మ్యాచ్‌లో ఆ మైలురాయిని చేరుకోవడం విశేషం. 

ఇదిలా ఉంటే, ఈ మ్యాచ్‌లో ఆసీస్‌.. పర్యాటక ఇంగ్లండ్‌పై 9 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఇంగ్లండ్ నిర్ధేశించిన 20 ప‌రుగుల ల‌క్ష్యాన్ని ఆసీస్‌ ఒక్క వికెట్‌ మాత్రమే కోల్పోయి ఛేదించింది. ఫలితంగా 5 టెస్ట్‌ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో సెంచ‌రీతో చెలరేగిన ట్రావిస్ హెడ్‌కు మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు లభించింది.

స్కోరు బోర్డు: ఇంగ్లండ్ 147 & 297
ఆస్ట్రేలియా 425 & 20/1
చదవండి: క్రికెట్‌ అభిమానులకు చేదు వార్త..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement