IND VS AUS 1st Test: బంతితో విఫలమైనా బ్యాటింగ్‌లో ఇరగదీసిన అక్షర్‌ పటేల్‌ | IND VS AUS 1st Test: Axar Patel Completed Career Second Fifty | Sakshi
Sakshi News home page

BGT 2023: బంతితో విఫలమైనా బ్యాటింగ్‌లో ఇరగదీసిన అక్షర్‌ పటేల్‌

Published Fri, Feb 10 2023 5:11 PM | Last Updated on Fri, Feb 10 2023 5:11 PM

IND VS AUS 1st Test: Axar Patel Completed Career Second Fifty - Sakshi

Axar Patel: బోర్డర్‌ గవాస్కర్‌ ట్రోఫీ-2023లో భాగంగా నాగ్‌పూర్‌ వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న తొలి టెస్ట్‌లో టీమిండియా అప్‌కమింగ్‌ ఆల్‌రౌండర్‌ అక్షర్‌ పటేల్‌ అదరగొట్టాడు. ఈ మ్యాచ్‌లో అక్షర్‌ బంతితో విఫలమైనా, కీలక తరుణంలో బ్యాటింగ్‌కు వచ్చి అర్ధసెంచరీతో మెరిశాడు. మరో ఎండ్‌లో రవీంద్ర జడేజా సహకారంతో జట్టుకు కీలక పరుగులు సమకూర్చిన అక్షర్‌.. కెరీర్‌లో రెండో హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. ఈ ఫీట్‌ సాధించేందుకు 94 బంతులు ఆడిన అక్షర్‌ 8 ఫోర్లు బాదాడు. జట్టు స్కోర్‌ 240 వద్ద నుండగా తొమ్మిదవ స్థానంలో బ్యాటింగ్‌కు వచ్చిన అక్షర్‌.. బాధ్యతాయుతంగా ఆడి హాఫ్‌ సెంచరీ పూర్తి చేసుకోవడంతో పాటు జట్టుకు అత్యంత​ కీలకమై లీడ్‌ను అందించడంలో తనవంతు పాత్ర పోషించాడు.

ఈ మ్యాచ్‌లో బౌలింగ్‌లో ఒక్క వికెట్‌ కూడా పడగొట్టలేకపోయిన అక్షర్‌ బ్యాట్‌తో మెరుగ్గా రాణిస్తూ.. జట్టు బ్యాటింగ్‌ డెప్త్‌ ప్రత్యర్ధికి తెలిసేలా చేశాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి టీమిండియా స్కోర్‌ 321/7గా ఉంది. అక్షర్‌ (52), రవీంద్ర జడేజా (66) క్రీజ్‌లో ఉన్నారు. ఈ మ్యాచ్‌లో రోహిత్‌ శర్మ (120) సెంచరీ సాధించి స్కోర్‌కు బలమైన పునాది వేయగా.. జడేజా, అక్షర్‌ జోడీ అజేయమైన 81 పరుగులు జోడించి, టీమిండియా ఆధిక్యాన్ని 144 పరుగులకు చేర్చారు.

భారత ఇన్నింగ్స్‌లో కేఎల్‌ రాహుల్‌ (20), అశ్విన్‌ (23) ఓ మోస్తరు స్కోర్లతో పర్వాలేదనిపించగా.. పుజారా (7), కోహ్లి (12), సూర్యకుమార్‌ యాదవ్‌ (8), కేఎస్‌ భరత్‌ (8) దారుణంగా నిరాశపరిచారు. ఆసీస్‌ బౌలర్లలో టాడ్‌ మర్ఫీ 5 వికెట్లు పడగొట్టగా.. నాథన్‌ లయోన్‌, పాట్‌ కమిన్స్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. అంతకుముందు ఆసీస్‌ తొలి ఇన్నింగ్స్‌లో 177 పరుగులకే ఆలౌటైన విషయం తెలిసిందే. జడేజా (5/47), అశ్విన్‌ (3/42) ఆసీస్‌ పతనాన్ని శాశించారు. సిరాజ్‌, షమీ తలో వికెట్‌ పడగొట్టారు. ఆసీస్‌ ఇన్నింగ్స్‌లో లబూషేన్‌ (49) టాప్‌ స్కోరర్‌గా నిలిచాడు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement