భారత్- బంగ్లాదేశ్ జట్ల మధ్య 2 మ్యాచ్‌ల టెస్ట్ సిరీస్‌లో భాగంగా రేపటి (డిసెంబర్ 14) నుంచి తొలి మ్యాచ్ ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. బంగ్లా పర్యటనలో వన్డే సిరీస్‌ను 1-2 తేడాతో కోల్పోయిన టీమిండియా.. టెస్ట్ సిరీస్‌ను విజయంతో ప్రారంభించాలని పట్టుదలగా ఉంది. గాయం కారణంగా రెగ్యులర్ కెప్టెన్ రోహిత్ శర్మ ఈ సిరీస్‌కు దూరమైన నేపథ్యంలో కేఎల్ రాహుల్ జట్టు సారధిగా వ్యవహరించనున్నాడు.
గాయాల కారణంగా రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ సిరీస్ నుంచి వైదొలగడంతో జట్టులో మూడు మార్పులు జరిగాయి. రోహిత్ స్థానంలో అభిమన్యు ఈశ్వరన్ జట్టులోకి రాగా.. షమీ, జడేజాల స్థానంలో నవదీప్ సైనీ, సౌరభ్ కుమార్ జట్టులో చేరారు. ఈ మార్పులతో పాటు ముందుంగా ప్రకటించిన జట్టులో మరో కీలక మార్పు చోటు చేసుకుంది.
ఈ సిరీస్‌కు వైస్ కెప్టెన్‌గా ఎంపికైన రిషబ్ పంత్ బీసీసీఐ ఆ బాధ్యతల నుంచి తప్పించింది. పంత్ స్థానంలో చతేశ్వర్ పుజారాను ఎంపిక చేసింది. చట్టోగ్రామ్ వేదికగా భారతకాలమానం ప్రకారం రేపు ఉదయం 9 గంటల నుంచి తొలి టెస్ట్ ప్రారంభంకానుంది.
ఇదిలా ఉంటే, బంగ్లాతో తొలి టెస్ట్‌కు ముందు టీమిండియా మాజీ కెప్టెన్, రన్ మెషీన్ విరాట్ కోహ్లిని ఓ అరుదైన రికార్డు ఊరిస్తుంది. ఈ మ్యాచ్‌లో విరాట్ సెంచరీ సాధిస్తే, ఓ ఏడాది మూడు ఫార్మాట్లలో సెంచరీ బాదిన ఆటగాడిగా అరుదైన రికార్డు తన ఖాతాలో వేసుకుంటాడు.
ఈ ఏడాది ఇప్పటికే టీ20 (ఆసియా కప్‌లో ఆఫ్ఘనిస్తాన్‌పై), వన్డేల్లో (మూడో వన్డేలో బంగ్లాదేశ్‌పై)సెంచరీలు బాదిన కోహ్లి.. రేపటి నుంచి ప్రారంభమయ్యే టెస్ట్ మ్యాచ్‌లో సెంచరీ సాధిస్తే.. మహేళ జయవర్ధనే (2010), సురేశ్ రైనా (2010), తిలకరత్నే దిల్షాన్ (2011), అహ్మద్ షెహజాద్ (2014), తమీమ్ ఇక్బాల్ (2016), కేఎల్ రాహుల్ (2016), రోహిత్ శర్మ (2017), డేవిడ్ వార్నర్ (2019), బాబర్ ఆజమ్ (2022) సరసన చేరతాడు.
బంగ్లాపై తొలి టెస్ట్‌లో సెంచరీ చేస్తే కోహ్లి తన అంతర్జాతీయ సెంచరీల సంఖ్యను 73కు పెంచుకుంటాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాళ్ల జాబితాలో దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ 100 సెంచరీలతో అగ్రస్థానంలో ఉండగా.. కోహ్లి (72) ఆ తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు.
బంగ్లాదేశ్‌తో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు..
శుభ్‌మన్ గిల్, అభిమన్యు ఈశ్వరన్, శ్రేయస్ అయ్యర్, చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, రవిచంద్రన్ అశ్విన్, అక్షర్ పటేల్, సౌరభ్ కుమార్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), శ్రీకర్ భరత్ (వికెట్‌కీపర్), రిషబ్ పంత్, కుల్దీప్ యాదవ్, శార్దూల్ ఠాకూర్, జయదేవ్ ఉనద్కత్, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్, నవ్‌దీప్ సైనీ
Comments
Please login to add a commentAdd a comment