భారత స్టార్ క్రికెటర్, రికార్డుల రారాజు విరాట్ కోహ్లి మరో అరుదైన ఘనత ముంగిట నిలిచాడు. బంగ్లాదేశ్‌తో టెస్టు సిరీస్ నేపథ్యంలో టీమిండియా దిగ్గజం సచిన్ టెండుల్కర్ పేరిట ఉన్న ప్రపంచ రికార్డును బద్దలు కొట్టేందుకు సిద్ధమయ్యాడు. ఇందుకోసం.. కోహ్లి మరో 58 పరుగులు సాధిస్తే చాలు..!! ఇంతకీ ఆ రికార్డు ఏమిటంటారా?!..
వన్డే శతక రారాజు
ఢిల్లీ బ్యాటర్ విరాట్ కోహ్లి 2008లో అంతర్జాతీయ క్రికెట్‌లో అడుగుపెట్టాడు. టీమిండియా తరఫున ఇప్పటి వరకు వన్డేల్లో 50, టెస్టుల్లో 29, టీ20లో ఒక శతకం బాదాడు. మొత్తంగా 80 సెంచరీలతో సచిన్ టెండుల్కర్(100 సెంచరీలు) తర్వాతి స్థానంలో కొనసాగుతున్నాడు. అయితే, ఇప్పటికే వన్డేల్లో సచిన్ సెంచరీల(49) రికార్డును కోహ్లి బ్రేక్ చేశాడు. యాభై ఓవర్ల ఫార్మాట్లో శతకాల రారాజుగా ఆవిర్భవించాడు.
27 వేల పరుగుల మైలురాయికి చేరువలో
ఇదిలా ఉంటే.. విరాట్ కోహ్లి ఇప్పటికే టెస్టుల్లో 8848, వన్డేల్లో 13906, టీ20లలో 4188 పరుగులు సాధించాడు. మొత్తంగా తన ఖాతాలో 26,942 పరుగులు జమచేసుకున్నాడు. బంగ్లాదేశ్‌తో టెస్టులో మరో 58 రన్స్ చేశాడంటే.. కోహ్లి అంతర్జాతీయ క్రికెట్‌లో 27 వేల పరుగుల మైలురాయిని చేరుకుంటాడు. ఈ క్రమంలోనే సచిన్ టెండుల్కర్ వరల్డ్ రికార్డును అతడు బద్దలు కొట్టనున్నాడు.
సచిన్ 623 ఇన్నింగ్స్‌లో సాధిస్తే
కాగా సచిన్ ఖాతాలో 34,357 పరుగులు ఉన్నాయి. అయితే, ఇందులో 27 వేల పరుగులు పూర్తి చేసుకునేందుకు సచిన్ 623 ఇన్నింగ్స్ ఆడాల్సి వచ్చింది. 226 టెస్టు, 396 వన్డే, ఒక టీ20 ఇన్నింగ్స్‌లో ఈ మైలురాయిని అతడు అందుకున్నాడు. తద్వారా ఇంటర్నేషనల్ క్రికెట్‌లో అత్యంత వేగంగా ఈ ఘనత సాధించిన క్రికెటర్‌గా నిలిచాడు.
అదే జరిగితే.. 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో చిరస్థాయిగా కోహ్లి పేరు
అయితే, విరాట్ కోహ్లి ఇప్పటికి 591 ఇన్నింగ్స్‌లోనే 26,942 పరుగులు చేశాడు. బంగ్లాతో సెప్టెంబరు 19న మొదలయ్యే తొలి టెస్టులో 58 పరుగులు చేశాడంటే.. అత్యంత తక్కువ ఇన్నింగ్స్‌లో అంతర్జాతీయ క్రికెట్‌లో 27 వేలు పరుగులు చేసిన క్రికెటర్‌గా సచిన్‌ను అధిగమిస్తాడు. కేవలం 592 ఇన్నింగ్స్‌లోనే ఈ ఫీట్ నమోదు చేసి.. 147 ఏళ్ల క్రికెట్ చరిత్రలో ఈ ఘనత సాధించిన తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కుతాడు. అదీ సంగతి!
కాగా ప్రపంచ టెస్టు చాంపియన్‌షిప్ 2023-25లో భాగంగా టీమిండియా- బంగ్లాదేశ్ మధ్య తొలుత రెండు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ జరుగనుంది. ఇదిలా ఉంటే.. అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన కోహ్లి.. టెస్టు, వన్డేల్లో కొనసాగుతున్న విషయం తెలిసిందే.
చదవండి: IND vs BAN: భారత్‌తో టెస్టు సిరీస్.. బంగ్లా జట్టు ప్రకటన! స్టార్ ప్లేయర్ దూరం
Comments
Please login to add a commentAdd a comment