నేటి నుంచి ఇంగ్లండ్‌తో తొలి టెస్టు
ఉదయం గం. 10:30 నుంచి ఫ్యాన్‌కోడ్ యాప్‌లో ప్రత్యక్ష ప్రసారం
ముల్తాన్: స్వదేశంలో పాకిస్తాన్ జట్టు మరో టెస్టు సిరీస్‌కు సిద్ధమైంది. ఇటీవల బంగ్లాదేశ్ చేతిలో వైట్‌వాష్‌కు గురైన పాకిస్తాన్ నేటి నుంచి ఇంగ్లండ్‌తో తలపడనుంది. మూడు మ్యాచ్‌ల సిరీస్‌లో భాగంగా సోమవారం నుంచి ముల్తాన్ వేదికగా తొలి టెస్టు ప్రారంభం కానుంది. రెగ్యులర్ కెప్టెన్ బెన్ స్టోక్స్ ఈ మ్యాచ్‌కు దూరం కాగా... అతడి స్థానంలో ఒలీ పోప్ ఇంగ్లండ్ జట్టుకు సారథిగా వ్యవహరించనున్నాడు. ఇటీవల శ్రీలంకపై మూడు మ్యాచ్‌ల సిరీస్‌కు కూడా స్టోక్స్ అందుబాటులో లేకపోగా... పోప్ కెప్టెన్సీలో ఇంగ్లండ్ జట్టు సిరీస్ గెలుచుకుంది.
రెండేళ్ల క్రితం పాకిస్తాన్‌లో పర్యటించిన ఇంగ్లండ్ మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది. విపరీతమైన వేడి ఉండే ముల్తాన్‌లో స్పిన్నర్లకు సహకారం లభించే అవకాశం ఉండటంతో జాక్ లీచ్, షోయబ్ బషీర్ రూపంలో ఇద్దరు స్పిన్నర్లకు ఇంగ్లండ్ తుది జట్టులో చోటు కలి్పంచింది. పేస్ బౌలింగ్‌లో మాత్రం అనుభవరాహిత్యం కనిపిస్తోంది. పేస్ బౌలర్ బ్రైడన్ కార్స్ టెస్టు అరంగేట్రం చేయనుండగా.. అతడితో పాటు అట్కిన్‌సన్, వోక్స్, బ్రూక్ పేస్ విభాగాన్ని నడిపించనున్నారు.
మరోవైపు గత నాలుగేళ్లుగా స్వదేశంలో టెస్టు సిరీస్ గెలవలేకపోయిన పాకిస్తాన్ ఈసారి అస్త్రశస్త్రాలతో సిద్ధమవుతోంది. టెస్టు కెపె్టన్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఆడిన ఐదు మ్యాచ్‌ల్లోనూ జట్టును గెలిపించలేకపోయిన పాక్ సారథి షాన్ మసూద్‌పై తీవ్ర ఒత్తిడి ఉంది. మాజీ కెప్టెన్ బాబర్ ఆజమ్‌తో పాటు వికెట్ కీపర్ రిజ్వాన్, అబ్దుల్లా షఫీఖ్, సౌద్ షకీల్, సల్మాన్ సమష్టిగా సత్తా చాటాలని పాకిస్తాన్ టీమ్ మేనేజ్‌మెంట్ ఆశిస్తోంది. బౌలింగ్‌లో షాహీన్ అఫ్రిది, నసీమ్ షా, కీలకం కానున్నారు. అబ్రార్, సల్మాన్ స్పిన్ బాధ్యతలు పంచుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment