బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2023లో భాగంగా నాగ్‌పూర్ వేదికగా ఫిబ్రవరి 9 నుంచి భారత్-ఆస్ట్రేలియా జట్ల మధ్య తొలి టెస్ట్ ప్రారంభం కానున్న విషయం తెలిసందే. ప్రతిష్టాత్మక ఈ సిరీస్ కోసం ఇరు జట్లు సన్నాహకాల్లో బిజీగా ఉన్నాయి. తొలి టెస్ట్ కోసం భారత్, ఆస్ట్రేలియా జట్లు కఠోరంగా శ్రమిస్తున్నాయి. నాగ్‌పూర్‌లో భారత్, బెంగళూరులో ఆసీస్ ఆటగాళ్లు శిక్షణా శిబిరాల్లో చెమటోడుస్తున్నారు. గెలుపే లక్ష్యంగా ఇరు జట్లు వ్యూహరచనలో నిమగ్నమై ఉన్నాయి. క్రికెట్ ఆస్ట్రేలియా అయితే టీమిండియాపై మాటల యుద్ధానికి దిగి మైండ్ గేమ్‌ను మొదలుపెట్టేసింది.
ఇంత బిజీ షెడ్యూల్‌లోనూ టీమిండియా వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ ఓ ఆసక్తికర సంభాషణలో (సోషల్‌మీడియా) పాల్గొన్నాడు. మహిమా అనే ఓ ట్విటర్ యూజర్ చేసిన కామెంట్‌కు యాష్ ఫన్నీ రిప్లై ఇచ్చాడు. అబ్బాయిలకు ఒక్కటే కావాలి, అది B అనే ఇంగ్లీష్ పదంతో స్టార్ట్ అవుతుందని మహిమ ట్వీట్ చేయగా.. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అంటూ అశ్విన్ సమాధానం చెప్పాడు. మహిమ ఉద్దేశంలో ఇది కరెక్టో కాదో తెలీదు కానీ అశ్విన్ ఇచ్చిన సమాధానం మాత్రం సోషల్‌మీడియాలో తెగ వైరలవుతోంది.
క్రికెట్ పట్ల అశ్విన్‌కు ఉన్న పిచ్చిని చూసి నెటిజన్లు అతన్ని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు. యాష్.. BGT 2023ని చాలా సిరీయస్‌గా తీసుకుంటున్నాడని, ఓ బాధ్యతాయుతమైన దేశ క్రికెటర్‌కు ఇది చాలా అవసరమని టీమిండియా ఫ్యాన్స్ కొనియాడుతున్నారు. కొందరైతే అశ్విన్‌కు సెన్స్ ఆఫ్ హ్యూమర్ చాలా ఎక్కువని అంటున్నారు. మరోవైపు మహిమ చేసిన కామెంట్‌పై కూడా చాలామంది స్పందిస్తున్నారు. ఎవరికి తోచిన విధంగా వారు సమాధానలు చెబుతున్నారు. కొందరేమో బహిరంగంగా వాడకూడని అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తున్నారు. మొత్తానికి BGT 2023లో తొలి టెస్ట్‌కు ముందు ఓ సరదా సంభాషణతో అశ్విన్ టీమిండియా అభిమానులను అలరించారు.
ఇదిలా ఉంటే, బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో అశ్విన్ పాత్ర ఎంత కీలకమైనదో అందరికీ తెలిసిందే. భారత్-ఆసీస్‌ల మధ్య ఎప్పుడు టెస్ట్ మ్యాచ్ జరిగినా అశ్విన్ కీ రోల్ ప్లే చేస్తాడు. ఈ సిరీస్‌లోనూ యాష్ ప్రధాన పాత్ర పోషిస్తాడని అందరూ అంచనా వేస్తున్నారు. స్పిన్‌కు సహకరించే పిచ్‌లపై అశ్విన్ బంతితో పాటు బ్యాట్‌తో ఏరకంగా రెచ్చిపోతాడో గతంలో చాలా సందర్భాల్లో మనం చూసాం. ఈ సిరీస్‌లో టీమిండియా స్పిన్ విభాగాన్ని లీడ్ చేసే అశ్విన్‌కు ఆసీస్ స్టార్ ఆటగాళ్లు వార్నర్, స్టీవ్ స్మిత్, లబూషేన్‌ల మధ్య తీవ్ర పోటీ ఉంటుందని ఫ్యాన్స్ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. ఈ సిరీస్‌లో అశ్విన్ మరో వికెట్ తీస్తే.. టెస్ట్‌ల్లో 450 వికెట్ల మైలురాయిని చేరుకుంటాడు.
Comments
Please login to add a commentAdd a comment