యాషెస్ సిరీస్ 2023 తొలి టెస్ట్ ఆఖరి రోజు ఆటకు వర్షం ముప్పు పొంచి ఉందని తెలుస్తోంది. ఎడ్జ్‌బాస్టన్ వాతావరణ శాఖ ఫోర్‌కాస్ట్ నివేదిక ప్రకారం.. ఇవాళ ఉదయం ఉరుములతో కూడిన భారీ వర్షం కురుస్తుందని సమాచారం. అయితే మ్యాచ్ ఆరంభ సమయానికి వరుణుడు శాంతివచ్చని అధికారులు నివేదికలో పొందుపర్చారు. తిరిగి 11 గంటల సమయంలో వర్షం పడేందుకు 84 శాతం అవకాశాలు ఉన్నాయని.. అది మధ్యాహ్న సమయానికి 50-40 శాతానికి పడిపోవచ్చని సమాచారం. మొత్తంగా చూస్తే కీలకమైన చివరి రోజు ఆటకు వరుణుడు ఆటంకం కలిగించక మానడని తెలుస్తోంది.
ఇదిలా ఉంటే, యాషెస్ సిరీస్ తొలి టెస్ట్ రసవత్తరంగా సాగుతుంది. చివరి రోజు ఆటలో ఇంగ్లండ్ గెలవాలంటే 7 వికెట్లు, ఆసీస్ గెలవాలంటే 174 పరుగులు చేయాల్సి ఉంది. బజ్‌బాల్ అప్రోచ్ అని ఇంగ్లండ్ ఓవరాక్షన్ చేయకపోయుంటే ఈ మ్యాచ్‌లో ఆ జట్టే పైచేయి సాధించి ఉండేది. ఏదో పొడిచేద్దామని ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను మరో 2 వికెట్లు మిగిలుండగానే తొలి రోజే డిక్లేర్ చేసి చేతులు కాల్చుకుంది.
ప్రస్తుతం పరిస్థితి (విజయావకాశాలు) ఫిఫ్టి-ఫిఫ్టిగా ఉంది. ఆఖరి రోజు ఆసీస్ సైతం బజ్‌బాల్ అంటూ ఎదురుదాడికి దిగి విజయం సాధిస్తుందా లేక ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగి విజయాన్ని సాధిస్తారా అన్నది తేలాలంటే మరి కొద్ది గంటలు వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment