
IND VS BAN 1st Test Day 1: చట్టోగ్రామ్ వేదికగా బంగ్లాదేశ్‌తో ఇవాళ (డిసెంబర్ 14) ప్రారంభమైన తొలి టెస్ట్‌లో టీమిండియా నామమాత్రపు స్కోర్‌కే పరిమితమైంది. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 6 వికెట్ల నష్టానికి 278 పరుగులు చేసింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ ఎంచుకున్న టీమిండియా 48 పరుగులకే 3 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడగా.. చతేశ్వర్ పుజారా (90), శ్రేయస్ అయ్యర్ (82 నాటౌట్) బాధ్యతాయుతమైన అర్ధసెంచరీలతో ఆదుకున్నారు. రిషబ్ పంత్ (46) పర్వాలేదనిపించాడు.
112 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన దశలో పుజారా, శ్రేయస్ 149 పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేసి టీమిండియాకు గౌరవప్రదమైన స్కోర్ అందించారు. కేఎల్ రాహుల్ (22), శుభ్‌మన్ గిల్ (20), విరాట్ కోహ్లి (1) నిర్శాపరిచారు. తొలి రోజు ఆఖరి బంతికి అక్షర్ పటేల్ (14) ఔటయ్యాడు. బంగ్లా బౌలర్లలో తైజుల్ ఇస్లాం 3 వికెట్లు పడగొట్టగా.. మెహిది హసన్ 2, ఖలీద్ అహ్మద్ ఓ వికెట్ దక్కించుకున్నారు.
భారత్: శుభ్‌మన్ గిల్, కేఎల్ రాహుల్ (కెప్టెన్), చతేశ్వర్ పుజారా, విరాట్ కోహ్లి, శ్రేయస్ అయ్యర్, రిషబ్ పంత్, అక్షర్ పటేల్, రవిచంద్రన్ అశ్విన్, కుల్దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ఉమేశ్ యాదవ్
బంగ్లాదేశ్: జాకీర్ హసన్, నజీముల్ హొస్సేన్ షాంటో, లిట్టన్ దాస్, షకీబ్ అల్ హసన్ (కెప్టెన్), ముష్ఫికర్ రహీమ్, యాసిర్ అలీ, నురుల్ హసన్, మెహిది హసన్ మీరజ్, తైజుల్ ఇస్లాం, ఖలీద్ అహ్మద్, ఎబాదత్ హొస్సేన్