ఎడ్జ్‌బాస్టన్ వేదికగా ఇంగ్లండ్-ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న యాషెస్ సిరీస్-2023 తొలి టెస్ట్ మ్యాచ్ సందర్భంగా ఇంగ్లండ్ అభిమానులు ఆసీస్ స్టార్ ఆటగాడు స్టీవ్ స్మిత్‌ను దారుణంగా అవమానించారు. నాలుగో రోజు ఆటలో బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న స్మిత్‌ను ఇంగ్లండ్ ఫ్యాన్స్ ఎగతాళి చేస్తూ రాక్షసానందం పొందారు. 2018 బాల్ టాంపరింగ్ ఇష్యూ తదనంతరం జరిగిన ఓ విషయాన్ని ప్రస్తావిస్తూ గేలి చేశారు.
Atmosphere 💀pic.twitter.com/Oxt4mQ860k
— Shivani (@meme_ki_diwani) June 19, 2023
బాల్ టాంపరింగ్ ఉదంతం తర్వాత స్మిత్ మీడియా ముందు ఏడుస్తూ తప్పు ఒప్పుకున్న విషయాన్ని హైలైట్ చేస్తూ ఓ పాట ద్వారా టీజ్ చేశారు. We Saw You Crying On Telly (నువ్వు టీవీలో ఏడుస్తుంటే మేము చూశాం) అంటూ స్టేడియం మొత్తం ముక్తకంఠంతో పాట పాడుతూ స్మిత్ మనసు గాయపడేలా ప్రవర్తించారు.
Heartbreaking. Steve Smith has broken down delivering a message to young Aussie cricket fans. pic.twitter.com/l14AsvAhXz
— cricket.com.au (@cricketcomau) March 29, 2018
స్టేడియంలో ప్రేక్షకులు ఇలా చేస్తుంటే స్మిత్ తెగ ఇబ్బంది పడ్డాడు. పైకి నవ్వుతూ ఇంకా పాడండి అంటున్నట్లు తల ఊపినప్పటికీ.. అతని ముఖంలో బాధ స్పష్టంగా కనిపించింది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరలవుతుంది. నెటిజన్లు ఇంగ్లండ్ ప్రేక్షకులు ప్రవర్తించిన తీరును తప్పుబడుతున్నారు. ఎలాంటి వ్యక్తినైనా ఈ తరహాలో ఎగతాళి చేయడం కరెక్ట్ కాదని అంటున్నారు.
Steve Smith heads over to the Hollies for the first time this series….#Ashes pic.twitter.com/Hs1cRB56Lb
— England's Barmy Army 🏴🎺 (@TheBarmyArmy) June 19, 2023
ఇదిలా ఉంటే, యాషెస్ సిరీస్ తొలి టెస్ట్ రసవత్తరంగా సాగుతుంది. చివరి రోజు ఆటలో ఇంగ్లండ్ గెలవాలంటే 7 వికెట్లు, ఆసీస్ గెలవాలంటే 174 పరుగులు చేయాల్సి ఉంది. బజ్‌బాల్ అప్రోచ్ అని ఇంగ్లండ్ ఓవరాక్షన్ చేయకపోయుంటే ఈ మ్యాచ్‌లో ఆ జట్టే పైచేయి సాధించి ఉండేది. ఏదో పొడిచేద్దామని ఆ జట్టు తొలి ఇన్నింగ్స్‌ను మరో 2 వికెట్లు మిగిలుండగానే తొలి రోజే డిక్లేర్ చేసి చేతులు కాల్చుకుంది.
ప్రస్తుతం పరిస్థితి (విజయావకాశాలు) ఫిఫ్టి-ఫిఫ్టిగా ఉంది. ఆఖరి రోజు ఆసీస్ సైతం బజ్‌బాల్ అంటూ ఎదురుదాడికి దిగి విజయం సాధిస్తుందా లేక ఇంగ్లండ్ బౌలర్లు చెలరేగి విజయాన్ని సాధిస్తారా అన్నది తేలాలంటే మరో కొద్ది గంటలు వేచి చూడాల్సిందే.
Comments
Please login to add a commentAdd a comment