Kapil Dev advises Rohit Sharma while praising England's Bazball approach - Sakshi
Sakshi News home page

బజ్‌బాల్‌ అద్భుతం! కెప్టెన్‌గా రోహిత్‌ కూడా మరింత దూకుడుగా ఉండాలి: టీమిండియా దిగ్గజం

Published Wed, Aug 16 2023 9:30 AM | Last Updated on Wed, Aug 16 2023 9:56 AM

He Must Be More Aggressive Kapil Dev Advises Rohit Sharma Praising Bazball Approach - Sakshi

Indian cricket legend  Praising England’s “Bazball” approach: సంప్రదాయ క్రికెట్‌లో ఇంగ్లండ్‌ అనుసరిస్తున్న ‘బజ్‌బాల్‌’ విధానం అద్భుతంగా ఉందని టీమిండియా దిగ్గజం కపిల్‌ దేవ్‌ కొనియాడాడు. టెస్టుల్లో అన్ని క్రికెట్‌ జట్లు ఇలాంటి దూకుడు ప్రదర్శిస్తే ఆట మరింత రసవత్తరంగా ఉంటుందని పేర్కొన్నాడు. ఇటీవల తాను చూసిన అత్యుత్తమ టెస్టు సిరీస్‌లలో యాషెస్‌ అద్భుతమని కొనియాడాడు.

కాగా న్యూజిలాండ్‌ మాజీ స్టార్‌ బ్రెండన్‌ మెకల్లమ్‌ ఇంగ్లండ్‌ టెస్టు క్రికెట్‌ కోచ్‌ అయిన తర్వాత.. బెన్‌స్టోక్స్‌ సారథ​ంలో బజ్‌బాల్‌ విధానానికి శ్రీకారం చుట్టాడు. పరిమిత ఓవర్ల మాదిరే టెస్టుల్లోనూ దూకుడు ప్రదర్శిస్తూ ఇప్పటికే ఇంగ్లండ్‌ గుర్తుండిపోయే విజయాలు సాధించింది కూడా! 

డ్రాగా ముగిసినా
ఆస్ట్రేలియాతో ప్రతిష్టాత్మక యాషెస్‌ సిరీస్‌లోనూ దూకుడును కొనసాగించింది. తొలి టెస్టులో అతి విశ్వాసంతో ఓటమి పాలైనా వెనక్కి తగ్గేదేలే అన్నట్లు ముందుకు సాగింది. ఈ క్రమంలో పర్యాటక ఆసీస్‌తో కలిసి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 2-2తో సమంగా నిలిచి డ్రాతో సరిపెట్టుకుంది. 

అయితే, సిరీస్‌ ఆసాంతం.. ముఖ్యంగా ఆఖరి టెస్టు నువ్వా- నేనా అన్నట్లు సాగడం అభిమానులకు మజాను అందించింది. ఈ నేపథ్యంలో కపిల్‌ దేవ్‌ తాజా ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. బజ్‌బాల్‌ విధానంపై ప్రశంసలు కురిపించాడు. ‘‘బజ్‌బాల్‌ అద్భుతం. 

రోహిత్‌ మరింత దూకుడుగా ఉండాలి
ఇటీవల నేను చూసిన సిరీస్‌లలో ఇంగ్లండ్‌- ఆస్ట్రేలియా సిరీస్‌ అత్యుత్తమంగా అనిపించింది. నిజానికి క్రికెట్‌ అంటే అలాగే ఆడాలి మరి! మన కెప్టెన్‌ రోహిత్‌ వర్మ మంచి సారథి అనడంలో సందేహం లేదు. అయితే, నాయకుడిగా తను కూడా ఇకపై మరింత దూకుడుగా ఉండాలి. ఇంగ్లండ్‌ ఎలా ఆడుతుందో గమనించాలి.

కేవలం మనం మాత్రమే కాదు.. అన్ని క్రికెట్‌ జట్లు బజ్‌బాల్‌ గురించి ఆలోచించాలి. కేవలం డ్రాలతో సరిపెట్టుకునే విధానానికి స్వస్తి పలికి దూకుడుగా ఆడుతూ.. గెలుపే పరమావధిగా ముందుకు సాగాలి’’ అని కపిల్‌ దేవ్‌ ప్రపంచ టెస్టు క్రికెట్‌ జట్లకు సూచించాడు. అలాంటపుడే ఆటకు మరింత ఆదరణ లభిస్తుందని అభిప్రాయపడ్డాడు.

కాగా వచ్చే ఏడాది జనవరి 25 నుంచి టీమిండియా- ఇంగ్లండ్‌ మధ్య  ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్‌ జరుగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రోహిత్‌ను ఉద్దేశించి కపిల్‌ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

చదవండి: కలలు నిజమైన వేళ: వాళ్లు మెరిశారు..! ఇక అందరి దృష్టి అతడిపైనే..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement