
కెవిన్ పీటర్సన్ (ఫైల్ ఫోటో)
సాక్షి, స్పోర్ట్స్ : ‘స్విచ్ షాట్’ ఇన్వెంటర్, ఇంగ్లాండ్ స్టార్ బ్యాట్స్‌మన్ కెవిన్ పీటర్సన్ క్రికెట్‌కు గుడ్‌బై చెప్పారు. ఇంగ్లాండ్ తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో బ్యాట్స్‌మన్‌గా రికార్డులకెక్కిన కెవిన్.. 14 ఏళ్లపాటు అంతర్జాతీయ క్రికెట్‌లో కొనసాగారు. సోషల్ మీడియా ద్వారా శనివారం ఆయన రిటైర్మెంట్ ప్రకటించారు.
ఇంగ్లండ్ తరుపున 104టెస్టులు, 136 వన్డేలు, 37 టీ-20లు ఆడిన పీటర్సన్ పలు రికార్డులు సాధించాడు. నాలుగు యాషెస్ సిరీస్ గెలవడం, సొంతగడ్డపై భారత్‌ను ఓడించడం, టీ20 ప్రపంచకప్ గెలుచుకోవడం లాంటివి కెరీర్‌లో మధురజ్ఞాపకాలని పీటర్సన్ ట్వీట్‌లో పేర్కొన్నారు. ఐపీఎల్‌లో బెంగళూర్, ఢిల్లీ, పుణె జట్ల తరఫున ఆడిన ఆయన ప్రస్తుతం పాకిస్థాన్ సూపర్ లీగ్‌లో క్వెట్టా గ్లాడియేటర్స్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో టెస్ట్‌లు, వన్డేల్లో 32 సెంచరీలు, 60 అర్థసెంచరీలు, 17వికెట్లు సాధించారు. పీటర్సన్ రిటైర్మెంట్ ప్రకటన ట్వీట్‌పై పలువురు క్రికెటర్లు, వ్యాఖ్యాతలు రీట్వీట్ చేస్తున్నారు.
Just been told that I scored 30000+ runs which included 152 fifty’s & 68 hundreds in my professional career.
— Kevin Pietersen (@KP24) 17 March 2018
Time to move on! pic.twitter.com/zMSIa3FK6K