
మందు ఆపేశాడు(ట)!
ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ డేవిడ్ వార్నర్ తెలుసుగా. ఏ దేశంలో ఉన్నా పబ్‌లలో తాగి ఏదో ఒక గొడవలోకి దిగడంలో ప్రస్తుత తరం క్రికెటర్లలో తనే టాప్. అయితే తాను మందు తాగి ఇప్పటికి 100 రోజులు దాటిపోయిందని చెప్పాడు వార్నర్. అదేంటని ఆశ్చర్యంగా ప్రశ్నిస్తే... ఇంగ్లండ్‌లో యాషెస్ సిరీస్ కచ్చితంగా గెలవాలని, అందుకోసం తాను శారీరకంగా పూర్తి ఫిట్‌నెస్‌తో ఉండాలని భావించాడట. అందుకే యాషెస్‌కు నెల రోజుల ముందు నుంచే మందు తాగడం ఆపేశాడట.
ఒకవేళ యాషెస్ గెలిస్తే మాత్రం పూటుగా తాగాలని అనుకున్నాడట. కానీ ఆస్ట్రేలియా సిరీస్ ఓడిపోయింది. ఇక వన్డేలు ఆడి తిరిగి ఆస్ట్రేలియా వెళ్లేవరకూ మందు ముట్టుకునే ప్రసక్తే లేదని చెప్పాడు వార్నర్. తాగితే ఎక్కువకాలం క్రికెట్ ఆడలేనని ఈ ఆస్ట్రేలియన్ స్టార్ తెలుసుకున్నాడు.