ఐఫోన్‌ ప్రేమికులకు శుభవార్త | Apple upcoming low-cost iPhones to enter mass production in February | Sakshi
Sakshi News home page

ఐఫోన్‌ ప్రేమికులకు శుభవార్త

Published Wed, Jan 22 2020 7:26 PM | Last Updated on Wed, Jan 22 2020 7:45 PM

 Apple upcoming low-cost iPhones to enter mass production in February - Sakshi

సాక్షి,న్యూఢిల్లీ: ఐ ఫోన్‌ ప్రేమికులకు శుభవార్త. బడ్జెట్‌ ధరలో ఐఫోన్‌. అసలు ఈ మాటే...వినియోగదారులకు వీనుల విందైన మాటల మూట. ఐఫోన్లపై వినియోగదారుల క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు ఆపిల్‌ కంపెనీ సన్నద్ధమవుతోంది. తక్కువ ధరలో ఐఫోన్‌ను త్వరలో విడుదల చేయనుంది.  ఈ ఏడాది మార్చి నాటికి ఈ ఫోన్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకురానుంది. ఈ నేపథ్యంలో వచ్చేనెల ఫిబ్రవరి నుంచి ఈ కొత్త ఐఫోన్‌ విడిభాగాల అసెంబ్లింగ్‌ను ప్రారంభించనుంది.ఇందుకోసం హ్యాండ్‌సెట్‌ అసెంబ్లింగ్‌ను హాన్‌హయ్‌ ప్రీసీషన్‌ ఇండస్ట్రీ, పెగట్రాన్‌ కార్పోరేషన్‌, విస్ట్రన్‌ కార్పొరేషన్‌లకు అప్పగించింది. తద్వారా అటు వినియోగదారులకు ఆకట్టుకోవడంతోపాటు, భారతదేశంలో వేగంగా అభివృద్ధి చెందుతున్న స్మార్ట్‌ఫోన్‌ మార్కెట్‌లో తన స్థానాన్ని  మరింత విస్తరించుకోవాలని ఆపిల్‌ భావిస్తోంది. 

ఐఫోన్ ఎస్‌ఈ తరువాత అతి తక్కువ ధరలో రానున్న మొదటి ఐఫోన్ మోడల్ ఇది కానుండటం విశేషం.  4.7అంగుళాల స్క్రీన్‌తో 2017లో వచ్చిన ఐఫోన్ 8 మాదిరిగానే ఉండనుందట.  అలాగే ఆండ్రాయిడ్‌ ఫోన్ల మాదిరిగానే  ఫింగర్‌ ప్రింట్‌ సెన్సర్‌ను అమర్చనుంది. 2020లో మరిన్ని కొత్త ఫీచర్లు, 5 జీ కనెక్టివిటి, పాస్టర్‌ ప్రొసెసర్‌, 3డి బ్యాక్‌ కెమెరా లాంటి ఫీచర్లతో హైఎండ్‌ ఐ ఫోన్‌లను అందుబాటులోకి తేవాలని యోచిస్తోంది.  అలాగే 2020 లో 200 మిలియన్ యూనిట్లకు పైగా రవాణా చేయాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకుంది ఆపిల్‌. ఈ లక్ష్య సాధనలో రానున్న లోబడ్జెట్‌ ఐఫోన్‌ ముఖ్యమైన పాత్ర పోషించనుందని భావిస్తున్నారు. ప్రస్తుతానికి దీని ధరపై ఎలాంటి అంచనాలు  లేవు. మరోవైపు ఈ  వార్తలపై స్పందించడానికి ఆపిల్ ప్రతినిధి నిరాకరించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement